Tollywood: థియేటర్లలో అలరించి.. ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలివే!
Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో వారం వారం ప్రేక్షకుల్ని అలరించడానికి పలు సినిమాలు విడుదలవుతుంటాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా థియేటర్‌లోనూ, ఓటీటీలోనూ ప్రేక్షకుల్ని అలరించడానికి కొన్ని చిత్రాలు విడుదల కాబోతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా...!
ఈ వారం థియేటర్‌లో వచ్చే సినిమాలివే..
మేజర్ (Major)
మొదటి నుంచి విభిన్న చిత్రాలు, కథలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు అడవి శేష్. ప్రస్తుతం 'మేజర్'తో థియేటర్‌లలో సందడి చేసేందుకు రాబోతున్నారు. ముంబయి 26/11 ఉగ్రదాడుల్లో పౌరుల ప్రాణాలను కాపాడుతూ అమరుడైన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కింది. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్, శోభిత దూళిపాళ్ల కీలక పాత్రలు పోషించారు. కాగా, ఈ సినిమాకు శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. తమిళం, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో విడుదల కానుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో అతికొద్ది మందికోసం ఈ సినిమాను ప్రదర్శించారు. కాగా, ఈ చిత్రాన్ని ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ సంస్థలతో కలిసి జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
విక్రమ్ (Vikram)
విశ్వనటుడు కమల్‌హాసన్ నటించిన తాజా చిత్రం విక్రమ్. ఈ చిత్రంలో కమల్‌హాసన్‌తోపాటు మరో ఇద్దరు స్టార్ హీరోలు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రల్లో నటించారు. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా ఈ చిత్రంలో అతిథి పాత్రలో మెరవనున్నారు. దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ చిత్రం కూడా జూన్ 3వ తేదీన తెలుగు, తమిళ రెండు భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ అందించిన నేపథ్య సంగీతం హైలెట్‌గా నిలవనుంది. కరోనా తర్వాత లాంగ్ గ్యాప్ తర్వాత కమల్‌హాసన్ చిత్రం విడుదల కానుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
సమ్రాట్ పృథ్వీరాజ్ (prudhvi raj chouhan)
మరాఠా రాజ్‌పూత్ యోధుడు పృధ్వీరాజ్ చౌహాన్ వీరగాథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'సమ్రాట్ పృధ్వీరాజ్'. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించారు. ఇందులో మానుషి హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా కూడా తెలుగు, పలు దక్షిణాది భాషలతోపాటు హిందీ భాషలోనూ జూన్ 3న విడుదల కాబోతోంది. కాగా, ఈ సినిమాలో సంజయ్ దత్, సోనూసూద్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఇక, ఈ చిత్రాన్ని యశ్‌రాజ్ ఫిల్మ్ నిర్మిస్తోంది. డైరెక్టర్ చంద్రప్రకాశ్ ద్వివేది తెరకెక్కించారు.
థియేటర్లలో అలరించి.. ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలివే!
అశోకవనంలో అర్జున కల్యాణం (Ashoka Vanamlo Arjuna Kalyanam)
విశ్వక్‌సేన్ కథానాయకుడిగా విద్యా సాగర్ చింతా తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'అశోకవనంలో అర్జున కల్యాణం'. రుక్సార్ థిల్లాన్, రితికా నాయక్ కథానాయకలుగా నటించారు. ఈ చిత్రం థియేటర్లలో చిన్న సినిమాగా విడుదలై హిట్ టాక్ అందుకుంది. ఈ చిత్రం జూన్ 3 నుంచి తెలుగు ఓటీటీ 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. గోపరాజు రమణ, కేదార్ శంకర్, కాదంబరి కిరణ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. కాగా, ఈ చిత్రాన్ని విద్యాసాగర్ తెరకెక్కించారు.
9 అవర్స్ (9 hours)
హీరో నందమూరి తారకరత్న, అజయ్, మధుశాలిని ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ '9అవర్స్'. ప్రముఖ దర్శకుడు క్రిష్ అందించిన కథతో నిరంజన్ కౌశిక్, జాకబ్ వర్గీస్‌లు దర్శకత్వం వహించారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా జూన్2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. 'డెక్కన్ ఇంపీరియల్ బ్యాంక్'లో 9గంటల పాటు ఏం జరిగిందన్న ఆసక్తికర కథాంశంతో ఈ సిరీస్ తెరకెక్కించారు. ఈ సిరీస్‌ను వై.రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.
నెట్‌ఫ్లిక్స్
జనగణమన (మలయాళం) జూన్ 2
సర్వైవింగ్ సమ్మర్ (వెబ్ సిరీస్) జూన్ 3
ద పర్‌ఫెక్ట్ మదర్ (వెబ్ సిరీస్) జూన్ 3
అమెజాన్ ప్రైమ్
ద బాయ్స్ (వెబ్ సిరీస్3) జూన్3
బుక్ మై షో
బెల్‌ఫాస్ట్ (హాలీవుడ్) జూన్3
ఎంఎక్స్ ప్లేయర్
ఆశ్రమ్ (హిందీ సిరీస్3) జూన్3