ఇద్దరు హీరోలతో భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న ‘గాడ్ ఫాదర్’ (God Father) డైరెక్టర్?  

Updated on Oct 06, 2022 03:23 PM IST
‘గాడ్ ఫాదర్’ (God Father) మూవీ తర్వాత క్రేజీ ప్రాజెక్టుకు ప్లాన్ చేస్తున్న దర్శకుడు మోహన్ రాజా 
‘గాడ్ ఫాదర్’ (God Father) మూవీ తర్వాత క్రేజీ ప్రాజెక్టుకు ప్లాన్ చేస్తున్న దర్శకుడు మోహన్ రాజా 

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన ‘గాడ్ ఫాదర్’ (God Father) చిత్రం దసరా కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకు ప్రముఖ తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించారు. ‘హనుమాన్ జంక్షన్’ సినిమా తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం ‘గాడ్ ఫాదర్’తో టాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్నారు మోహన్ రాజా. 

‘గాడ్ ఫాదర్’ విజయంపై హీరో చిరుతోపాటు డైరెక్టర్ మోహన్ రాజా చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు. ఈ చిత్రం ఏస్థాయిలో హిట్ అవుతుందో మరికొన్ని గంటల్లో ప్రేక్షకులు ఇచ్చే తీర్పుతో తేలిపోతుంది. ఈ విషయాన్ని పక్కనబెడితే.. మోహన్ రాజా ఇకపై తెలుగులో మరిన్ని మూవీలు తీయాలని ప్లాన్ చేస్తున్నారు. 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ‘ధ్రువ 2’ తీసేందుకు మోహన్ రాజా రెడీ అవుతున్నారని తెలిసింది. ఇప్పటికే స్క్రిప్టు వర్కు కూడా పూర్తయ్యిందని సమాచారం. ఈ సినిమా ఒరిజినల్ తమిళ వెర్షన్ అయిన ‘తని ఒరువన్’ను మోహన్ రాజా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. 

రామ్ చరణ్ మూవీతోపాటు మరో క్రేజీ ప్రాజెక్టునూ మోహన్ రాజా లైన్‌లో పెట్టారట. కింగ్ అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni)తో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారట మోహన్ రాజా. ఈ చిత్రంలో నాగ్‌తోపాటు ఆయన తనయుడు అఖిల్ (Akhil Akkineni) కూడా నటిస్తారట. యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించే ప్లాన్‌లో ఉన్నారని సమాచారం. 

‘గాడ్ ఫాదర్’ ఇవ్వాళ విడుదలవుతున్న నేపథ్యంలో త్వరలో నాగ్‌తో చేసే చిత్రంపై మోహన్ రాజా ఫోకస్ చేస్తారని తెలుస్తోంది. ఇటీవలే నాగార్జున నటించిన ఘోస్ట్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అఖిల్ మాట్లాడుతూ.. ‘నాన్నతో ఓ సినిమా చేస్తున్నా’ అంటూ హింట్ కూడా ఇచ్చారు. మరి ఈ తండ్రీకొడుకులను మోహన్ రాజా డైరెక్ట్ చేస్తారో లేదో చూడాలి. ఈ విషయంపై మోహన్ రాజా, నాగార్జునల నుంచి కన్ఫర్మేషన్ వస్తే కానీ ప్రాజెక్టు గురించి క్లారిటీ రాదు. 

ఇకపోతే, నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ దసరా కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అఖిల్.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ అనే సినిమా చేస్తున్నారు. ఇది కూడా యాక్షన్ ఓరియంటెడ్ చిత్రం కావడం విశేషం. 

Read more: God Father: 'గాడ్ ఫాద‌ర్' సీక్వెల్‌కు రెడీ అంటున్న ద‌ర్శ‌కుడు మోహన్ రాజా

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!