రాజ‌మండ్రి రోజ్ మిల్క్( RajahmundryRoseMilk) ఎలా ఉంటుందో చూపించిన‌ సుకుమార్ (Sukumar)

Updated on May 29, 2022 05:29 PM IST
RajahmundryRoseMilk: రాజ‌మండ్రి రోజ్ మిల్క్ ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్‌(Sukumar) సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. 
RajahmundryRoseMilk: రాజ‌మండ్రి రోజ్ మిల్క్ ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్‌(Sukumar) సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. 

RajahmundryRoseMilk: ప్ర‌ముఖ సినీ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్ రాజ‌మండ్రి రోజ్ మిల్క్ సినిమాను నిర్మిస్తుంది. నాని బండ్రెడ్డి ద‌ర్శ‌కత్వంలో రాజ‌మండ్రి రోజ్ మిల్క్‌లో జై జాస్తి, అనంతిక జంట‌గా న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. ఫ‌న్నీ, క్యూట్ ల‌వ్ స్టోరిగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. సన్నీల్‌ కుమార్‌, వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌, ప్రణీత్‌ పట్నాయక్‌ ముఖ్యపాత్రల్లో న‌టిస్తున్నారు 

రాజ‌మండ్రి రోజ్ మిల్క్ సినిమాను సురేష్‌ ప్రొడక్షన్స్‌తో కలిసి ఇంట్రూప్‌ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. డి.సురేష్‌బాబు, ప్రదీప్‌ ఉప్పలపాటి నిర్మాతలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాజ‌మండ్రి రోజ్ మిల్క్ సినిమాలో హీరో హీరోయిన్ల ఎవ‌ర‌నేది ఫ‌స్ట్ లుక్ రిలీజ్ వ‌ర‌కు తెలియ‌లేదు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్‌(Sukumar) సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. 

RajahmundryRoseMilk: యూత్ ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రాజ‌మండ్రి రోజ్ మిల్క్ తెర‌కెక్కిస్తున్నామ‌ని ద‌ర్శ‌కుడు నాని చెప్పారు. కాలేజీ రోజుల‌ను గుర్తు చేశాలా సినిమా స్టోరి ఉంటుంద‌న్నారు. జూన్‌ 10 నుంచి రెండవ షెడ్యూల్‌ను రాజమ్రండి, వైజాగ్‌లో చిత్రీక‌రిస్తామ‌ని నిర్మాత తెలిపారు. రాజ‌మండ్రి రోజ్ మిల్క్ సెప్టెంబ‌ర్‌లో రిలీజ్ కానుంది.  ఈ చిత్రానికి సంగీతం గోవింద్‌ వసంత్‌, అజయ్‌ అరసాడ, యశ్వంత్‌ నాగ్‌, భరత్‌-సౌరభ్‌లు అందిస్తున్నారు. ఈ సినిమాలోని పాట‌ల‌కు లిరిక్స్ చంద్ర‌బోస్, అనంత శ్రీరామ్ రాశారు. 
 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!