హీరో విజ‌య్‌(Vijay)తో అట్లుంట‌ది మ‌రి!!!

Updated on Apr 26, 2022 06:31 PM IST
త‌మిళ స్టార్ విజ‌య్(Vijay) 'బీస్ట్' బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా ప‌డింది. కేజీఎఫ్2 దెబ్బ‌కు కుదేలైంది. విజ‌య్ మాత్రం ఈ సినిమా పోతే మ‌రో సినిమాతో హిట్ కొట్టొచ్చంటూ కూల్‌గా ఉన్నాడు. పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. 

సినిమా హిట్ కాక‌పోతే ఎవ‌రైనా బాధ‌లో మునిగిపోతారు. కానీ త‌మిళ స్టార్ విజ‌య్ మాత్రం అలాకాదు. 'బీస్ట్స‌(Beast) మూవీ టీంతో విజ‌య్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. కో కో కోకిల, డాక్టర్  సినిమాల‌తో హిట్ కొట్టిన ద‌ర్శ‌కుడు నెల్స‌న్ దిలీప్ కుమార్. విజ‌య్ హీరోగా దిలీప్ ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన సినిమా బీస్ట్ . స్టార్ హీరో విజ‌య్, టాప్ హీరోయిన్ పూజ హెగ్డే .. ఇక హిట్ అనుకుంటే.. కేజీఎఫ్2 ఆ క‌థ‌ను మార్చేసింది. కేజీఎఫ్2 దెబ్బ‌కు బీస్ట్ ఫ‌ట్ మంది.

నెల్స‌న్ దిలీప్ కుమార్ కామెడీలో కాంప్ర‌మైజ్ కారు. త‌మిళ ప్రేక్ష‌కులు యాక్ష‌న్‌తో పాటు కామెడీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. రిలీజ్ అయిన మొద‌టి రోజు నుంచే బీస్ట్ నెగెటీవ్ టాక్ తెచ్చుకుంది. కేజీఎఫ్2తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా ప‌డింది.  కేజీఎఫ్2 సినిమా దూకుడును బీస్ట్ త‌ట్టుకోలేక‌పోయింది. దీంతో విజ‌య్(Vijay) సొంత రాష్ట్రం త‌మిళ‌నాడులో బీస్ట్ థియేట‌ర్ల నుంచి ఔట్ అయింది. 

బీస్ట్ సినిమాతో భారీ న‌ష్టం వ‌చ్చింది. హీరో విజ‌య్ అవ‌న్నీ ప‌క్క‌న పెట్టేశారు. ఈ రోజు ఓ సినిమా ఫ‌ట్ అయితే రేపు మ‌రో సినిమా హిట్ అవుతుంద‌న్న‌ట్లు కూల్‌గా ఉన్నారు. బీస్ట్ సినిమా టీం అంద‌రికీ పార్టీ ఇచ్చారు. ఆ ఫోటో నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. రాజా.. మా డ‌బ్బు పోయి మేం ఏడుస్తుంటే.. పార్టీలేంటి రాజా విజ‌య్ (Vijay) అంటూ నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్లు అనుకుంటున్నారు. తెలుగులో బీస్ట్ సినిమాను దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!