విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)ను విచారించిన ఈడీ అధికారులు.. రౌడీ హీరో ఏమన్నారంటే?

Published on Dec 02, 2022 02:26 PM IST

లైగర్’ (Liger) సినిమా పెట్టుబడుల విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఓ రాజకీయ నేత ప్రమేయం కూడా ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఆ నాయకుడికి ఢిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధం ఉందని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ‘లైగర్’ చిత్రంలో భాగస్వాములైన వారందరినీ ఈడీ అధికారులు విచారిస్తున్నారు. 

ఇందులో భాగంగానే ‘లైగర్’ దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మీని గతంలో విచారించిన ఈడీ.. తాజాగా ఈ చిత్రంలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)ను విచారించింది. ఇటీవల విచారణకు హాజరైన విజయ్‌ను.. దాదాపు 11 గంటలపాటు ఈడీ అధికారులు పలు కోణాల్లో ప్రశ్నలు సంధించారని సమాచారం. 

విచారణ అనంతరం విజయ్ స్పందిస్తూ... ‘మనకొచ్చే పాపులారిటీ వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తాయి. వాటిల్లో ఇదొకటి. మీరు చూపించే అభిమానం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. జీవితంలో ఇదొక అనుభవం. ఈడీ అధికారులకు పూర్తిగా సహకరించా. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చా. నన్ను మళ్లీ రమ్మని చెప్పలేదు’ అని విజయ్ తెలిపారు. 

Read More: "నేను మోసం చేసింది ప్రేక్షకులను.. మళ్లీ సినిమా తీసి వారిని ఎంటర్టైన్ చేస్తా" : పూరి జగన్నాథ్ (Puri jagannath)