అవకాశాలు తగ్గినా.. తన గ్లామర్ తో అభిమానులను పెంచుకుంటున్న నిధి అగర్వాల్‌ (Nidhhi Agerwal)..!

Published on Nov 26, 2022 11:51 AM IST

ఇస్మార్ట్‌ హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ (Nidhhi Agerwal) తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్‌ బేస్ ను సంపాదించుకుంది. కెరీర్ పరంగా ఈ బ్యూటీకి సరైన హిట్లు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఆమెకు ఫాలోయింగ్ జోరుగా ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 21.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహరవీరమల్లు’ (Harihara Veeramallu) సినిమాలో కథానాయికగా నటిస్తోంది.  

తెలుగులో నిధి అగర్వాల్ తొలి సినిమా 'సవ్యసాచి' నుంచి నిన్నమొన్నటి 'హీరో' (Hero Movie) సినిమా వరకు.. ఫలితాలను పక్కన పెడితే నిధికి మాత్రం అభిమానుల సంఖ్య పెరుగుతూనే వచ్చింది. ఎనర్జటిక్ హీరో రామ్ (Ram Pothineni) నటించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా నిధి క్రేజ్‌ను అమాంతం పెంచేసింది. ఈ సినిమాలో నటనతోనే కాదు గ్లామర్ పరంగానూ అలరించారు. ఇక, తన తర్వాతి ప్రాజెక్ట్‌ ఏకంగా పవన్‌ కల్యాణ్‌ తో కావడంతో సోషల్ మీడియాలో ఈ భామకు అటెన్షన్‌ ఎక్కువైంది.

ఇదిలా ఉంటే.. ఇటీవల నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) చేసిన ఓ ప్రమోషన్ టాక్ ఆఫ్‌ ది టౌన్ గా మారింది. ఆమె ప్రముఖ కండోమ్ కంపెనీకి పెయిడ్ ప్రమోషన్ చేసింది. ఆ ప్రొడక్ట్ గురించి వివరిస్తూ ఓ వీడియో చేసి తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. కాగా, గతంలో సన్నీలియోన్, షెర్లిన్ చోప్రా, పూనమ్ పాండే వంటి వారు కూడా కండోమ్స్‌ యాడ్స్‌ లో నటించారు.

Read More: Biggboss Season 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో చివరి కెప్టెన్ ఇనయా సుల్తానా (Inaya Sultana)..!