తమన్నా (Tamannaah Bhatia) డ్రెస్‌ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!

Updated on May 01, 2022 10:31 PM IST
ఇటీవల జరిగిన ఫంక్షన్‌లో తమన్నా (Tamannaah Bhatia)
ఇటీవల జరిగిన ఫంక్షన్‌లో తమన్నా (Tamannaah Bhatia)

కొందరు ట్రెండ్‌ ఫాలో అవుతారు. మరికొందరు వాటిని సెట్‌ చేస్తూ ఉంటారు. అలాంటి కోవకు చెందిన వారిలో తమన్నా (Tamannaah Bhatia) ఒకరు. తమన్నా ఏ ఫంక్షన్‌లో కనిపించినా ట్రెండీగానే కనిపిస్తుంది. ఫంక్షన్‌, దానిని నిర్వహించే స్టేజీకి తగ్గట్టుగా రెడీ అయ్యి అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది ఈ మిల్కీ బ్యూటీ. ఇటీవల ఆమె ధరించిన ఒక డ్రెస్‌ గురించిన ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. అమెజాన్‌ ప్రైమ్‌ నిర్మిస్తున్న ‘జీ కర్దా’ అనే వెబ్‌ సిరీస్‌ ఇటీవల ప్రారంభమైంది. దానికి సంబంధించిన ప్రోగ్రామ్‌ ఒకటి జరిగింది.

ఈ ఫంక్షన్‌కు తమన్నా హాజరైంది. వేదికపై ఎంతమంది ఉన్నా తన అందంతో అందరినీ ఆకర్షిస్తుంది తమన్నా. అసలే మిల్కీ బ్యూటీ అందులోనూ స్కై బ్లూ కలర్‌‌ డ్రెస్‌ వేసుకుని ఫంక్షన్‌కు వచ్చింది. పొట్టి డ్రెస్‌లో తమన్నాను చూసిన వాళ్లు చూపుతిప్పుకోలేపోయారంటే అతిశయోక్తి కాదు. ఇక, ఆ తర్వాత తమన్నా అభిమానులు నెటిజన్లు ఆమె వేసుకున్న పొట్టి డ్రెస్‌ ధర గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆ డ్రెస్ ధర చూసి షాకయ్యారు. తమన్నా ధరించిన డ్రెస్ మరీ ఇంత కాస్ట్​లీనా అని ఆశ్చర్యపోతున్నారు.

డ్రెస్‌తో పాటు తమన్నా వేసుకున్న చెప్పుల ధర కూడా ఆశ్యర్యానికి గురిచేస్తోంది చాలామందిని. ఆ ఫంక్షన్‌లో తమన్నా వేసుకున్న డ్రెస్ ఖరీదు రూ.2,69,121. కాగాఆమె వేసుకున్న మ్యాచింగ్‌ చెప్పులు రూ.90,800 అని తెలిసింది. డ్రెస్, చెప్పుల కోసం తమన్నా ఇంత ఖర్చు చేసిందా అని అభిమానులు అనుకుంటున్నారు. అంతటితో ఊరుకోకుండా ఆ ధరలను తెలియజేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు.

కాగా, విక్టరీ వెంకటేష్, తమన్నా, మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్, మెహరీన్‌ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఎఫ్‌3. అనిత్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దిల్‌ రాజు నిర్మించిన ఎఫ్‌ 3 ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్‌‌గా వస్తోంది.

డిసెంబర్ 21న ముంబయిలో పుట్టిన తమన్నా (Tamannaah Bhatia).. 2005లో హిందీ సినిమా చాంద్‌ సా రోషన్‌ చెహ్రాతో చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు మూడు భాషల్లో కలిపి సుమారుగా 65 సినిమాల్లో నటించింది. తమిళ్‌ సినిమాల్లో అయాన్‌, పయ్యా, సిరుతాయ్, వీరమ్, ధర్మ దురై, దేవి, స్కెచ్‌తోపాటు తెలుగులో 100% లవ్, ఊసరవెల్లి, రచ్చ, తడాఖా, బాహుబలి 1, 2, బెంగాల్‌ టైగర్, ఊపిరి, ఎఫ్‌2, సైరా నరసింహారెడ్డి సినిమాలు విజయం సాధించాయి.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!