క‌శ్మీర్ లోయ‌లో 'ఖుషీ'గా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), స‌మంత‌ (Samantha)

Updated on May 11, 2022 11:31 PM IST
ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన ఖుషీ సినిమా రీమేక్ చేస్తున్నారంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఖుషీ రీమేక్‌లో విజయ్ దేవరకొండ, స‌మంత‌లు న‌టిస్తున్నారా? క‌శ్మీర్ లోయ‌ల్లో షూటింగ్‌కు అంతా రెడీనా ?
ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన ఖుషీ సినిమా రీమేక్ చేస్తున్నారంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఖుషీ రీమేక్‌లో విజయ్ దేవరకొండ, స‌మంత‌లు న‌టిస్తున్నారా? క‌శ్మీర్ లోయ‌ల్లో షూటింగ్‌కు అంతా రెడీనా ?


లైగ‌ర్ సినిమాతో బిజీగా ఉన్న హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ... శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నారు. ఆ సినిమాలో హీరోయిన్‌గా స‌మంత యాక్ట్ చేయ‌నున్నారు. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన ఖుషీ టైటిల్‌ను మళ్లీ ఈ సినిమా ద్వారా రిపీట్ చేస్తార‌ని టాక్. బహుశా ఈ చిత్రం, ఖుషీ సినిమా రీమేక్ అయ్యి కూడా ఉండవచ్చునని అంటున్నారు.

Ssamantha  And Vijay Devarakonda New Movie


రెగ్యుల‌ర్ షూటింగ్..
విజ‌య్, సామ్ ఇద్ద‌రూ సినీ ఇండ్ర‌స్ట్రీలో పెద్ద స్టార్స్. వీరికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కిస్తార‌ని సమాచారం. ఇదే క్రమంలో ఏప్రిల్ 21 తేదిన సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్మాతలు జరుపనున్నారు. ఏప్రిల్ 23 నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఉంటుందని అంటున్నారు. అలాగే క‌శ్మీర్‌లో ఫ‌స్ట్ షెడ్యూల్ షూటింగ్ జరిపి.. ఆ లోకేష‌న్స్‌లోనే కీల‌క స‌న్నివేశాలు చిత్రీకరిస్తారని టాక్.

Samantha  And Vijay Devarakonda New Movie

స్టోరీ ఏంటి? 
ల‌వ్‌స్టోరీలు తెర‌కెక్కించడంలో ద‌ర్శ‌కుడు శివ నిర్వాణకు మంచి పేరుంది. ఈ సినిమా కూడా ల‌వ్‌స్టోరీనే అని వినికిడి. కశ్మీర్ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కిస్తున్నారని వార్తలొస్తున్నాయి. 

 

Ssamantha  And Vijay Devarakonda New Movie

విజ‌య్, సామ్ పాత్ర‌లు
ఆర్మీ జ‌వానుగా ఈ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్నార‌ట‌. అలాగే క‌శ్మీరీ అమ్మాయిగా స‌మంత రోల్ ఉంటుంద‌ట‌. మ‌హాన‌టి సినిమాలో వీరిద్ద‌రి మ‌ధ్య కెమెస్ట్రీ ప్రేక్ష‌కుల‌కు తెగ న‌చ్చేసిన సంగతి తెలిసిందే. అందుకే, వీరి కాంబినేషనులో సినిమా వస్తే బాగుంటుందని ప్రేక్షకులు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. మ‌జిలీ త‌ర్వాత  శివ చేస్తున్న ఈ సినిమా భారీ హిట్ కొట్టేలా ఉండాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!