శ్రీ విష్ణు (Sree Vishnu) ‘భళా తందనాన’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

Updated on Apr 22, 2022 06:35 PM IST
‘భళా తందనాన’ కొత్త పోస్టర్
‘భళా తందనాన’ కొత్త పోస్టర్

యంగ్‌ హీరో శ్రీ విష్ణు (Sree Vishnu) నటించిన ‘భళా తందనాన’ మూవీ రిలీజ్ డేట్‌ వచ్చేసింది. బాణం సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చైతన్య దంతులూరి ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహించాడు. అల్లు అర్జున్‌ సరసన ఇద్దరమ్మాయిలతో, సరైనోడు చిత్రాల్లో నటించిన కేథరిన్‌ ట్రెసా ‘భళా తందనాన’ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది. కేజీఎఫ్‌ ఫేమ్‌ రామచంద్రరాజు విలన్‌గా నటించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 30వ తేదీన విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన సందర్భంగా సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్‌‌ను రిలీజ్‌ చేశారు. వారాహి చలనచిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. పోసాని కృష్ణమురళి, సత్య, శ్రీనివాస్‌ రెడ్డి, ఆదర్శ్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు.

నీది నాది ఒకే కథ, రాజ రాజ చోర, గాలి సంపత్, ఉన్నది ఒకటే జిందగీ, అప్పట్లో ఒక్కడుండేవాడు, మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, తిప్పరా మీసం లాంటి సినిమాలతో తనకంటూ ఒక వర్గం ప్రేక్షకులను సంపాదించుకున్న నటుడు శ్రీ విష్ణు (Sree Vishnu). తూర్పు గోదావరి అంతర్వేదిపాలెంలో జన్మించిన శ్రీవిష్ణు  విశాఖలోని గీతమ్ కాలేజీలో బీబీఎం చేశారు. అండర్ 19 ఆంధ్రా క్రికెట్ టీమ్ తరఫున ఆడిన ఘనత కూడా ఈ నటుడికి ఉంది. తొలుత షార్ట్ ఫిల్మ్‌లతో  తన కెరీర్ ప్రారంభించిన శ్రీవిష్ణు, తర్వాత సినీ రంగంలోకి వచ్చారు. నటుడు నారా రోహిత్ ఇతని స్నేహితుడు. వీరిద్దరూ కలిసి కూడా కొన్ని సినిమాలలో నటించారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!