Shivani Rajasekhar: మిస్ ఇండియా పోటీలో శివానీ రాజ‌శేఖ‌ర్

Updated on May 06, 2022 12:28 PM IST
Shivani Rajasekhar: యాంగ్రీ స్టార్ రాజ‌శేఖ‌ర్ గారాల ప‌ట్టి శివానీ రాజ‌శేఖ‌ర్. ఓటీటీ ఎంట్రీతో యాక్ట‌ర్‌గా అద‌ర‌గొట్టిన శివానీ రాజ‌శేఖ‌ర్‌.. మిస్ ఇండియా పోటీకి సెల‌క్ట్ అయ్యారు. మిస్ త‌మిళ‌నాడుగా సెలెక్ట్ అయ్యారు శివానీ రాజ‌శేఖ‌ర్.

శివానీ రాజ‌శేఖ‌ర్ (Shivani Rajasekhar) వెండితెర‌పై ఎంట్రీ ఇవ్వాల‌నుకున్నారు. కానీ ఓటీటీలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. అద్భుతం, WWW సినిమాలతో న‌టిగా మంచి పేరు తెచ్చుకున్నారు. శివానీ రాజ‌శేఖ‌ర్ న‌టించిన రెండు సినిమాలు ఓటీటీల్లోనే విడుద‌ల అయ్యాయి.

మిస్ ఇండియా పోటీకి సెల‌క్ట్ అయిన శివానీ రాజ‌శేఖ‌ర్‌

అడ‌వి శేషుతో శివానీ రాజ‌శేఖ‌ర్ తీసిన సినిమా మ‌ధ్య లోనే ఆగిపోయింది. కొన్ని సినిమాలు చేసినా..  అనుకోకుండా అవి కూడా మ‌ధ్య‌లోనే ఆగిపోయాయి. శివానీ రాజ‌శేఖ‌ర్ ప‌ట్టుద‌ల వీడ‌లేదు. తానేంటో...త‌న‌కు న‌ట‌న ప‌ట్ల ఎంత ఆస‌క్తి ఉందో నిరూపించేందుకు మ‌రో రూట్‌లో ముందుకు వెళ్తున్నారు.

మిస్ ఇండియా పోటీకి సెల‌క్ట్ అయిన శివానీ రాజ‌శేఖ‌ర్‌

సోష‌ల్ మీడియాలో శివానీ రాజ‌శేఖ‌ర్ (Shivani Rajasekhar)  చాలా యాక్టీవ్‌గా ఉంటారు. త‌న ఫోటో షూట్ వివ‌రాల‌తో నెటిజ‌న్ల‌ను, అభిమానుల‌ను ఖుషీ చేస్తుంటారు. మోడ‌లింగ్ అంటే శివానీకి ఎంతో ఇష్టం. అందుకే మిస్ ఇండియా పోటీల‌కు సై అంటున్నారు. ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలకు సిద్ధం అవుతున్నారు. 

మిస్ ఇండియా పోటీకి సెల‌క్ట్ అయిన శివానీ రాజ‌శేఖ‌ర్‌

డాక్టర్ రాజశేఖర్, జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివానీ ఫెమినా మిస్ ఇండియా రేస్‌కు వెళుతున్నారు. ఏప్రిల్ 30వ తేదీ జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో మిస్ తమిళనాడుగా శివానీ రాజశేఖర్ ఎంపికైంది. దేశవ్యాప్తంగా మొత్తం 31 మంది మిస్ ఇండియా కంటెస్టెంట్స్ లో పోటీ ప‌డుతున్నారు. శివానీ రాజశేఖర్ తమిళనాడు నుండి ఈ పోటీలో పాల్గొన్నారు. 

మిస్ ఇండియా పోటీకి సెల‌క్ట్ అయిన శివానీ రాజ‌శేఖ‌ర్‌

తెలుగు రాష్ట్రాల నుంచి ఎందుకు పోటీ చేయ‌లేద‌ని శివానీ శేఖ‌ర్ సినిమా ట్రైల‌ర్ రిలీజ్‌లో ఆన్స‌ర్ చేశారు. నిర్వాహకులు మల్టిపుల్ ఛాయిస్ ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రపదేశ్‌తో పాటు తమిళనాడులో కూడా ఆప్ష‌న్ ఇచ్చార‌న్నారు. త‌ను పుట్టిన త‌మిళ‌నాడు కేట‌గిరి నుంచి ఎంపిక చేశార‌న్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పోటీ ప‌డితే మ‌రింత హ్యాపీ ఫీల్ అయ్యేదాన్న‌ని చెప్పుకొచ్చారు.  

మిస్ ఇండియా పోటీకి సెల‌క్ట్ అయిన శివానీ రాజ‌శేఖ‌ర్‌

తాను పుట్టిన త‌మిళ‌నాడు నుంచి పోటీ చేయ‌డం కూడా ఆనందంగానే ఉంద‌న్నారు. అన్నింటిక‌న్నా మించి భారతదేశాన్ని రిప్రజెంట్ చేయ‌డం చాలా గ‌ర్వంగా ఉంద‌ని శివానీ రాజ‌శేఖ‌ర్ (Shivani Rajasekhar)  చెప్పారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!