Sekhar Master: శేఖ‌ర్ మాస్ట‌ర్‌కు శ్ర‌మ లేకుండా చేస్తున్న హీరో ఎవ‌రు?

Updated on May 05, 2022 07:29 PM IST
Sekhar Master: శేఖ‌ర్ మాస్ట‌ర్ స్టెప్పులను ప్రాక్టీస్ లేకుండా చేయ‌డం క‌ష్టం. వెరైటీ డాన్స్ కంపోజింగ్ శేఖ‌ర్ మాస్ట‌ర్ స్పెషాలిటీ. ఓ హీరో మాత్రం అస‌లు ప్రాక్టీస్ లేకుండానే సెట్స్‌లోకి వ‌చ్చేస్తార‌ట. 
Sekhar Master: శేఖ‌ర్ మాస్ట‌ర్ స్టెప్పులను ప్రాక్టీస్ లేకుండా చేయ‌డం క‌ష్టం. వెరైటీ డాన్స్ కంపోజింగ్ శేఖ‌ర్ మాస్ట‌ర్ స్పెషాలిటీ. ఓ హీరో మాత్రం అస‌లు ప్రాక్టీస్ లేకుండానే సెట్స్‌లోకి వ‌చ్చేస్తార‌ట. 

Sekhar Master: శేఖ‌ర్ మాస్ట‌ర్ స్టెప్పులను ప్రాక్టీస్ లేకుండా చేయ‌డం క‌ష్టం. వెరైటీ డాన్స్ కంపోజింగ్ శేఖ‌ర్ మాస్ట‌ర్ స్పెషాలిటీ. ఓ హీరో మాత్రం అస‌లు ప్రాక్టీస్ లేకుండానే సెట్స్‌లోకి వ‌చ్చేస్తార‌ట. ప్రాక్టీస్ లేక‌పోయినా డాన్సుల‌తో దుమ్ములేపుతాడ‌ట‌.. ఎవ‌రా హీరో.. ఏంటా క‌థ‌...

శేఖ‌ర్ మాస్ట‌ర్ స‌ర్కారు వారి పాట‌లో మ‌హేష్ బాబుతో డాన్సులు చేయిస్తున్నారు. మ‌హేష్ కోసం సూప‌ర్ స్టెప్పులు క్రియేట్ చేశారు. శేఖ‌ర్ మాస్ట‌ర్ కంపోజ్ చేసిన క‌ళావ‌తి పాటను చూస్తే... మ‌హేష్ డాన్స్‌కు ఫిదా అవ్వాల్సిందే. క్రియేటీవ్ కొరియోగ్రాఫ‌ర్‌గా శేఖ‌ర్ మాస్ట‌ర్‌కు మంచి ఇమేజ్ ఉంది. 

ఎన్టీఆర్ డైరెక్టుగా సెట్ కొచ్చి డాన్సుల‌తో అద‌ర‌గొడ‌తార‌న్న శేఖ‌ర్ మాస్ట‌ర్

స‌ర్కారు వారి పాట సినిమా ప్ర‌మోష‌న్ల కోసం శేఖ‌ర్  మాస్ట‌ర్ ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఓ ఇంట్ర‌స్టింగ్ విష‌యం తెలిసింది. హీరోల్లో త‌క్కువ రిహార్స‌ల్స్ చేసేది ఎవ‌ర‌ని శేఖ‌ర్ మాస్ట‌ర్‌ను అడిగితే..ట‌క్కున ఎన్టీఆర్ అని చెప్పారు. ఎన్టీఆర్ రిహార్స‌ల్స్‌కు రారంట‌. డైరెక్ట్‌గా సెట్స్‌లోకి వ‌చ్చి ఒక్క‌సారి  డాన్స్ స్టెప్ చూపిస్తే... వెంట‌నే చేసేస్తార‌ట‌.  ఎన్టీఆర్ డాన్స్‌ల్లో దుమ్ము రేగొడ‌తారంటూ శేఖ‌ర్ మాస్ట‌ర్ చెప్పుకొచ్చారు. 

శేఖ‌ర్ మాస్ట‌ర్ ఆచార్య‌, స‌ర్కారు వారి పాట‌కు వ‌ర్క్ చేశారు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న ఎన్టీఆర్30 సినిమాలో కూడా  కొరియోగ్రఫీ చేస్తున్నారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!