Shivkumar Sharma: సంతూర్ సంగీత విద్వాంసుడు పండిట్ శివకుమార్ శర్మ కన్నుమూత
Shivkumar Sharma: సుప్రసిద్ధ సంతూర్ విద్వాంసుడు, సంగీతకారుడు పండిట్ శివ కుమార్ శర్మ కన్నుమూశారు. గుండెపోటుతో శివ కుమార్ తుది శ్వాస విడిచారు. సంగీత ప్రియులకు శివకుమార్ మరణం తీరని లోటు.
సంతూర్ విద్వాంసుడు పండిట్ శివ కుమార్ గుండెపోటుతో మరణించారు. 84 ఏళ్ల శివకుమార్ సంతూర్ సంగీత విద్వాంసుడు. సంతూర్ సరిగమలను ప్రపంచం మొత్తం తెలిసేలా చేశారు. క్లాసికల్ మ్యూజిక్ ప్లే చేయడం శివ కుమార్ స్పెషాలిటీ.
వచ్చేవారం భోపాల్‌లో జరిగే ఓ కచేరీలో శివ కుమార్ ( Shivkumar Sharma) తన కళాప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. కానీ హఠాత్తుగా గుండెపోటు రావడంతో కనుమూశారు. శివ కుమార్ భార్య మనోరమా, కుమారులు రాహుల్, రోహిత్‌లు ఉన్నారు. శివకుమార్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. పండిట శివకుమార్ మృతితో సాంస్కృతిక లోకం చిన్నబోయిందన్నారు. సంతూర్ సంగీత కళను విశ్వవ్యాప్తం చేశారని. మోదీ అన్నారు.