Samuthira Khani: తెలుగు హీరోల‌కు విల‌న్ నేనేనంటున్న స‌ముద్ర‌ఖ‌ని

Updated on May 13, 2022 09:13 PM IST
Samuthira Khani:  ద‌ర్శ‌కత్వంతో పాటు విల‌న్ పాత్ర‌లు చేస్తున్న సౌత్ స్టార్ స‌ముద్ర‌ఖ‌ని (Samuthira Khani). ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలో మ‌రోసారి విలన్‌గా న‌టించ‌నున్నాడు.
Samuthira Khani: ద‌ర్శ‌కత్వంతో పాటు విల‌న్ పాత్ర‌లు చేస్తున్న సౌత్ స్టార్ స‌ముద్ర‌ఖ‌ని (Samuthira Khani). ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలో మ‌రోసారి విలన్‌గా న‌టించ‌నున్నాడు.

ద‌ర్శ‌కత్వంతో పాటు విల‌న్ పాత్ర‌లు చేస్తున్న సౌత్ స్టార్ స‌ముద్ర‌ఖ‌ని (Samuthira Khani). ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలో మ‌రోసారి విలన్‌గా న‌టించ‌నున్నాడు. స‌ర్కారు వారి పాట సినిమాలో విల‌నిజం చూపించిన స‌ముద్ర‌ఖ‌ని.. ఇక రోల్స్‌తోనే మెప్పిస్తానంటున్నాడు. 

స‌ముద్ర‌ఖ‌ని (Samuthira Khani) త‌మిళ ద‌ర్శ‌కుడు, న‌టుడు. ప్ర‌స్తుతం త‌మిళ సినిమాల‌తో పాటు తెలుగులో టాప్ హీరోల సినిమాల్లో విల‌న్ పాత్ర‌ల‌ను చేస్తున్నాడు. స‌ర్కారు వారి పాట సినిమాలో పొలిటిషియ‌న్‌గా, విల‌న్‌గా స‌ముద్ర‌ఖ‌ని యాక్ట చేసి మంచి పేరు తెచ్చుకున్నారు.

బీమ్లా నాయ‌క్ సినిమాలో ప‌వ‌న్ కల్యాణ్ హీరోగా చేస్తే.. ప్ర‌తినాయ‌కుడిగా ఇర‌గ‌దేశాడు స‌ముద్ర‌ఖ‌ని. 
తెలుగులో విలన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ .. రామ్ చరణ్ బాబాయి పాత్రలో న‌టించి గుర్తింపు తెచ్చుకున్నారు. సాఫ్ట్ క్యారెక్ట‌ర్లు చేయ‌గ‌ల‌న‌ని స‌ముద్ర‌ఖ‌ని ప్రూవ్ చేసుకున్నాడు. 

త‌మిళ సినిమా వినోద‌య సిత్రంలో స‌ముద్రఖ‌ని న‌టించారు. అదే సినిమాను తెలుగులో ప‌వ‌న్ క‌ల్యాణ్ రీమేక్ చేస్తున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే త‌న‌కు అభిమాన‌మ‌ని స‌ముద్ర‌ఖ‌ని చెప్పారు.  ఓ ఫ్యాన్‌గా ప‌వ‌న్‌ను ఎలా చూపించాల‌నే దానిపై త‌న‌కు క్లారిటీ ఉంద‌న్నారు. 

Samuthira Khani

సముద్రఖని (Samuthira Khani) లేటెస్ట్ కామెంట్స్‌తో  ప‌వ‌న్ క‌ల్యాణ్ కొత్త సినిమా ఏంటో తెలిసిపోయింది.  త్రివిక్రమ్ వినోద‌య సిత్రం రీమేక్ రైట్స్‌ను కొనుగోలు చేసారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు కూడా త్రివిక్ర‌మ్ రాస్తున్నారు.  ఒరిజినల్ వెర్షన్‌లో సముద్రఖనితో పాటు తంబి రామయ్య, సంచిత శెట్టి ప్రధాన పాత్రలో నటించారు.తెలుగులో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్  బ్యానర్‌లో సముద్రఖని ఈ రీమేక్ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు.

సినిమా క‌థ‌
ఓ ప్రైవేట్ కంపెనీ మేనేజ‌ర్ కార్ యాక్సిడెంట్‌లో చ‌నిపోతాడు.. ఆ చ‌నిపోయిన వ్య‌క్తి ఆత్మ తీసుకెళ్ల‌డానికి దేవుడు వ‌స్తాడు. చ‌నిపోయిన వ్య‌క్తికి కొన్ని ఆశయాలు ఉన్నాయ‌ని దేవుడికి చెబుతాడు. కొంత స‌మ‌యం త‌ర్వాత చావు ఇవ్వ‌మ‌ని దేవుడిని అడుగుతాడు. చావును మూడు నెల‌లు పోస్టు పోన్ చేసిన దేవుడిని ఇంకేం చేయ‌మంటాడ‌నే క‌థ‌నంతో  వినోద‌యం సిత్రం మూవీ సాగుతుంది. దేవుడి పాత్రలో పవన్ కల్యాణ్, చనిపోయిన మేనేజ‌ర్ పాత్ర‌లో సాయి ధరమ్ తేజ్ నటించన్నారు. 

పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ తర్వాత క్రిష్ దర్శకత్వంలో హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు సినిమా తీస్తున్నారు. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భ‌వ‌ధీయులు భ‌గ‌త్ సింగ్ సినిమాకు ఓకే చెప్పారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో యథా కాలమ్ తథా వ్యవహారమ్ సినిమాతో పాటు సుముద్ర‌ఖ‌ని (Samuthira Khani) డైరెక్ష‌న్‌లో రీమేక్ సినిమా చేస్తున్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!