సమంత (Samantha Ruth Prabhu) స్వీట్ వార్నింగ్ ఎవరికి ఇచ్చిందో తెలుసా?
సమంత (Samantha Ruth Prabhu) ట్వీట్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది సమంత. అయితే సామ్ ఎవరికి వార్నింగ్ ఇచ్చింది?
సమంత సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ అభిమానులకు వినోదం పంచుతారు. ఎప్పుడూ కూల్‌గా కనిపించే సామ్ ఈ సారీ కోపంగా ఓ ట్వీట్ చేసింది. సహనానికి ఓ హద్దు ఉంటుందంటూ వార్నింగ్ ఇచ్చింది. తన మౌనాన్ని అజ్ఞానం అనుకోవద్దని.. సైలెంట్‌గా ఉంటే అన్ని అంగీకరించినట్టు కాదని.. మంచి తనాన్ని చేతకానితనంగా అనుకోకండి అంటూ ఎటాక్ చేసింది.
నాగ చైతన్యతో (Naga Chaitanya విడిపోయినప్పటి నుంచి సామ్ అభిమానులకు ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నారు. కానీ ఇన్ డైరెక్ట్ మెసేజ్‌లతో తన పీలింగ్స్ బయట పెడుతున్నారు. ప్రస్తుతం సామ్ ఎవరికీ వార్నింగ్ (Warning) ఇచ్చారన్న దానిపై నెటిజన్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ట్రోల్ చేసేవారికి వార్నింగా లేక పర్స్‌నల్‌గా ఎవరికైనా ఇచ్చారా సామ్‌కే తెలియాలి. సమంత ఎవరిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటుదో చూడాలి