Samantha Ruth Prabhu: టాటూలపై సామ్ ముచ్చట్లు
సినిమాల్లోనే కాకుండా సోషల్‌మీడియాలోనూ హీరోయిన్ సమంత యాక్టివ్‌గా ఉంటారు. కొత్త సినిమాల అప్‌డేట్స్ ఇస్తుంటారు. అప్పుడప్పుడు అభిమానులతో మాట్లాడి సందడి చేస్తుంటారు. ఈసారి ఆమె తన టాటులపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.
సమంత ఇన్ స్టా ఫాలోవర్స్‌ను ఎప్పుడూ ఎంటర్‌టైన్ చేస్తుంటారు. తన ఫాలోవర్స్‌తో చిట్ చాట్ కూడా చేస్తుంటారు. ప్రస్తుతం నెటిజన్లతో సమంత తాజాగా చేసిన చిట్‌చాట్ వైరల్ అయింది. ఆమె టాటులపై తన అభిప్రాయాన్ని తెలిపారు. టాటూని వేయించుకుంటే ఎలాంటిది వేయించుకుంటారని ఓ నెటిజన్ సమంతను అడిగారు. అసలు టాటూలని ఇంకెప్పుడు వేయించుకోనని సమంత సమాధానం ఇచ్చారు. టాటూ వేయించుకునే ఆలోచనే వద్దన్నారు.
సామ్ టాటూల కథ
సమంత తన ఒంటిపై మూడు ట్యాటూలను వేయించుకుంది. "ఏం యాయ చేశావే" సినిమా పేరు అర్ధం వచ్చేలా వైఎంసీ అని తన వీపుపై టాటూ వేయించుకుంది. నడుంపైన చై అని తన మాజీ భర్త పేరుతో టాటూ ఉంది. కుడి చేతి మీద రెండు యారో మార్కులతో ఓ టాటూ ఉంది. యారో అంటే నిజమైన జీవితాన్ని సృష్టించుకోమని అర్థం.
సమంత ముచ్చట్లు
నెటిజన్లకు టాటూతో పాటు ఎన్నో కబుర్లు చెప్పారు సమంత. సామ్ థియేటర్లతో చూసిన సినిమా “జురాసిక్ పార్క్” అని తెలిపింది. అలాగే ఐదు వందల రూపాయలకు ఓ హోటల్‌లో ఆమె హోస్టెస్‌గా చేశారట. అదే తన మొదటి సంపాదన అని చెప్పారు. అంతేకాదు 'మీ కలలను నెరవేర్చుకునే దిశగా ప్రయత్నించండి' అంటూ అమ్మాయిలకు ఓ మెసేజ్ ఇచ్చారు.