పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో .. సాహో డైరెక్టర్ సినిమా

Updated on Apr 25, 2022 02:49 PM IST
Saaho Director Sujeeth and Pawan Kalyan
Saaho Director Sujeeth and Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం, క్రిష్ దర్శకత్వంలో "హరిహర వీరమల్లు" చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన సాయిధరమ్ తేజ్‌తో కలిసి ఓ మల్టీస్టారర్‌లో నటిస్తారని వార్తలొచ్చాయి. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో "భవదీయుడు భగత్ సింగ్" అనే సినిమాలో కూడా ఆయన నటించనున్నారు. 

ఇవి అన్నీ ఒక ఎత్తయితే, RRR లాంటి ప్రతిష్టాత్మక సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన డివివి దానయ్య నిర్మాణంలో కూడా పవన్ నటించనున్నారని వినికిడి. ఈ సినిమాకి సాహో దర్శకుడు సుజీత్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారట. ఈ చిత్రం తమిళ సినిమా "తేరి"కి రీమేక్ చిత్రమని కూడా పలువురు అంటున్నారు. 

ఏదేమైనా, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమా  "హరిహర వీరమల్లు" పైనే అందరి దృష్టి ఉంది. ఎ.ఎం. రత్నం, ఎ.దయాకరరావులు ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, సాయిమాధవ్ బుర్రా సంభాషణలను, కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఈ సినిమా తన రిలీజ్‌ను వాయిదా వేసుకోగా.. ఈ సంవత్సరం అక్టోబరులో ఇదే చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. 

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!