ఎస్ ఎస్ రాజమౌళి క్రియేట్ చేసిన విజువల్ వండర్ ఆర్.ఆర్.ఆర్ (RRR) .. 30 రోజుల కలెక్షన్ రిపోర్ట్
ఆర్.ఆర్.ఆర్ (RRR) సినిమా విడుదలై ఇప్పటికి 30 రోజులు కావస్తోంది. తెలుగులో ఇప్పటికే బాహుబలి కలెక్షన్ల రికార్డును బీట్ చేసిన ఈ చిత్రం, మిగతా వెర్షన్స్ విషయంలో మాత్రం నత్తనడకే నడిచింది. ఉత్తరాదితో పాటు ఇతర రాష్ట్రాలలో నిర్మాతలు అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయినా, నష్టాల బాట అయితే పట్టలేదు. ఓవరాల్‌గా మాత్రం పెద్ద సంచలనాన్నే నమోదు చేసింది. ముఖ్యంగా కేజీఎఫ్ 2 సినిమా ప్రభావం ఆర్.ఆర్.ఆర్ (RRR) పై విపరీతంగా పడింది. అలాగే 'బీస్ట్' మూవీ అపజయం మరోవైపు కలిసొచ్చింది.
ఈ క్రమంలో మనం కూడా ఓసారి 30 రోజుల కలెక్షన్ల రిపోర్టుని గమనిద్దాం
నైజాం (110.51 కోట్లు) , సీడెడ్ (49.92 కోట్లు), ఉత్తరాంధ్ర (32.53 కోట్లు), తూర్పు (16.04 కోట్లు), పశ్చిమం (12.97 కోట్లు), గుంటూరు (17.91 కోట్లు), కృష్ణా (14.40 కోట్లు), నెల్లూరు (09.20 కోట్లు)
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ (మొత్తం) - 263.48 కోట్ల షేర్
తమిళనాడు (37.68 కోట్లు), కేరళ (10.46 కోట్లు), కర్ణాటక (43.04 కోట్లు), బాలీవుడ్ (129.35 కోట్లు), ఓవర్సీస్ (100.10 కోట్లు), రెస్ట్ ఆఫ్ ఇండియా (10.00 కోట్లు)
ప్రపంచ వ్యాప్త కలెక్షన్
షేర్ - రూ.594.11 కోట్లు
గ్రాస్ - రూ.1103 కోట్లు