Brahmastra : ‘బ్ర‌హ్మ‌స్త్రం’ సెన్సార్ పూర్తి.. ర‌న్ టైమ్ ఎక్కువేన‌ట‌!

Updated on Sep 07, 2022 05:03 PM IST
ఫాంట‌సీ అడ్వెంచర్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన 'బ్ర‌హ్మాస్త్రం' (Brahmastra) చిత్రం ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకుంది.
ఫాంట‌సీ అడ్వెంచర్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన 'బ్ర‌హ్మాస్త్రం' (Brahmastra) చిత్రం ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకుంది.

Brahmastra : బాలీవుడ్‌లో అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన చిత్రం 'బ్ర‌హ్మాస్త్రం' (Brahmastra).  ఈ సినిమాలో స్టార్ కపుల్ ర‌ణ్‌బీర్ క‌పూర్ (Ranbir Kapoor), అలియా భట్ న‌టించారు. నాగార్జున‌, అమితాబ్ బ‌చ్చ‌న్, షారూక్ ఖాన్ వంటి దిగ్గ‌జాలు ప్ర‌త్యేక పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. పాన్ ఇండియా సినిమాగా 'బ్ర‌హ్మాస్త్రం' సెప్టెంబ‌ర్ 9న ఐదు భాష‌ల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ ఓ  విజువ‌ల్ వండ‌ర్‌గా చిత్రీక‌రించారు. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. 

భారీ బ‌డ్జెట్ సినిమా

అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన పాన్ ఇండియా సినిమా 'బ్ర‌హ్మాస్త్రం' తెలుగు వ‌ర్ష‌న్‌ను ద‌ర్శ‌క దిగ్గ‌జం రాజ‌మౌళి స‌మ‌ర్పిస్తున్నారు. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ అండ్ స్టార్‌లైట్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూ. 300 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మించాయి. 'బ్ర‌హ్మాస్త్రం' సినిమా హిందీతో పాటు తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల కానుంది. ఈ సినిమాను మొత్తం మూడు భాగాలుగా తెర‌కెక్కించ‌నున్నారు. 

విడుద‌ల‌కు ముందే రికార్డులు

ఫాంట‌సీ అడ్వెంచర్‌గా తెర‌కెక్కిన 'బ్ర‌హ్మాస్త్రం(Brahmastra) చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. యూ ఏ స‌ర్టిఫికేట్ పొందింది. ఈ సినిమా 2 గంట‌ల 46 నిమిషాలు అంటే.. మొత్తం 166 నిమిషాల పాటు ప్రద‌ర్శిత‌మ‌వ‌నుంది. ఈ సినిమా టికెట్లు భారీగా అమ్ముడ‌య్యాయ‌ట‌. కేవ‌లం ఒక్క పివీఆర్ మ‌ల్టీప్లెక్స్‌ల‌లోనే ల‌క్ష టిక్కెట్లు వ‌ర‌కు అమ్ముడ‌య్యాయ‌ని టాక్.

దాదాపు 18 నుంచి 22 కోట్ల రూపాయ‌ల బిజినెస్ జ‌రిగింద‌ని స‌మాచారం. బాలీవుడ్‌లో ఈ మ‌ధ్య కాలంలో విడుద‌లైన సినిమాల‌కు ఈ రేంజ్‌లో బుక్సింగ్ జ‌ర‌గ‌లేదు. ఈ నేప‌థ్యంలో త‌మ సినిమా స‌క్సెస్ సాధించ‌డం ప‌క్కా అంటున్నారు మేక‌ర్స్.

Read More: Brahmastra: 'బ్ర‌హ్మాస్త్రం' స‌రికొత్త రికార్డుల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌.. షాక్‌లో బాలీవుడ్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!