Brahmastra: 'బ్ర‌హ్మాస్త్రం' స‌రికొత్త రికార్డుల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌.. షాక్‌లో బాలీవుడ్

Updated on Sep 06, 2022 06:21 PM IST
ఫాంట‌సీ అడ్వేంచ‌ర్‌గా తెర‌కెక్కిన  'బ్ర‌హ్మాస్త్రం' (Brahmastra) సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డ‌తుండ‌టంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ల జోరు పెంచారు.
ఫాంట‌సీ అడ్వేంచ‌ర్‌గా తెర‌కెక్కిన  'బ్ర‌హ్మాస్త్రం' (Brahmastra) సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డ‌తుండ‌టంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ల జోరు పెంచారు.

Brahmastra : బాలీవుడ్ స్టార్ కపుల్ ర‌ణ్‌బీర్ క‌పూర్ (Ranbir Kapoor), అలియా భట్ న‌టించిన 'బ్ర‌హ్మాస్తం' చిత్రం సెప్టెంబ‌ర్ 9 తేదీన‌ ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. నాగార్జున‌, అమితాబ్ బ‌చ్చ‌న్, షారూక్ ఖాన్ వంటి స్టార్ న‌టులు ఈ సినిమాలో స్పెష‌ల్ పాత్ర‌ల్లో న‌టించారు. బాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ  విజువ‌ల్స్ వండ‌ర్‌గా ఈ సినిమాను చిత్రీక‌రించారు. 'బ్ర‌హ్మాస్త్రం' సినిమా విడుద‌ల‌కు ముందే రికార్డులు క్రియేట్ చేసింద‌ట‌.

మూడు భాగాలుగా 'బ్ర‌హ్మాస్త్రం'

అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన పాన్ ఇండియా సినిమా 'బ్ర‌హ్మాస్త్రం' తెలుగు వ‌ర్ష‌న్‌ను ద‌ర్శ‌క దిగ్గ‌జం రాజ‌మౌళి స‌మ‌ర్పిస్తున్నారు. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ అండ్ స్టార్‌లైట్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూ. 300 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మించాయి. 'బ్ర‌హ్మాస్త్రం' సినిమా హిందీతో పాటు తెలుగు, త‌మిళ్, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల కానుంది. ఈ సినిమాను మొత్తం మూడు భాగాలుగా నిర్మించ‌నున్నారు. 

అడ్వాన్స్ బుకింగ్స్ జోరు

ఫాంట‌సీ అడ్వేంచ‌ర్‌గా తెర‌కెక్కిన  'బ్ర‌హ్మాస్త్రం' (Brahmastra) సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డ‌తుండ‌టంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ల జోరు పెంచారు. మేకింగ్ వీడియోతో పాటు అల్ల‌రి మోత పాట‌ను రిలీజ్ చేశారు. మ‌రోవైపు అడ్వాన్స్ బుకింగ్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ సినిమా టికెట్లు భారీగా అమ్ముడ‌య్యాయ‌ట‌. కేవ‌లం ఒక్క పివీఆర్ మ‌ల్టీప్లెక్స్‌ల‌లోనే ల‌క్ష టిక్కెట్లు వ‌ర‌కు అమ్ముడ‌య్యాయ‌ని టాక్. బాలీవుడ్‌లో ఈ మ‌ధ్య కాలంలో విడుద‌లైన సినిమాల‌కు ఈ రేంజ్‌లో బుక్సింగ్ జ‌ర‌గ‌లేదు. ఈ నేప‌థ్యంలో త‌మ సినిమా స‌క్సెస్ సాధించ‌డం ప‌క్కా అంటున్నారు మేక‌ర్స్

భారీ బ‌డ్జెట్ సినిమా

'బ్ర‌హ్మాస్త్రం' మూడు భాగాలుగా తెర‌కెక్కుతుంది. 'బ్ర‌హ్మాస్త్రం' మొద‌టి భాగం శివ పేరుతో  హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్‌ 9న విడుదల కానుంది. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ అండ్ స్టార్‌లైట్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూ. 300 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మించాయి. బ్ర‌హ్మాస్త్రం విడుద‌ల త‌రువాత ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. 

Read More: Brahmastra : 'బ్ర‌హ్మాస్త్రం' ప్రీ రిలీజ్ ప్రోమో విడుద‌ల‌.. అంచ‌నాలు మ‌రింత పెంచిన విజువ‌ల్స్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!