నేపాల్‌ వార్తా పత్రిక ఫ్రంట్ పేజీలో రామ్ చరణ్ (Ram Charan) ఫోటో.. నెట్టింట వైరల్ అవుతున్న చిత్రం

Updated on May 02, 2022 12:46 PM IST
నేపాల్ మ్యాగజైన్ ముఖ చిత్రంపై RRR పోస్టర్
నేపాల్ మ్యాగజైన్ ముఖ చిత్రంపై RRR పోస్టర్

ఆర్ఆర్ఆర్ (RRR).. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. కేజీఎఫ్ 2, ఆచార్య లాంటి పెద్ద సినిమాల పోటీని తట్టుకొని మరీ ఈ చిత్రం నిలబడింది. ఈ క్రమంలో కలెక్షన్లను కూడా స్టడీగానే మెయిన్ టైన్ చేస్తోంది. ఒక్క ఆదివారమే ఆర్ఆర్ఆర్ (RRR) కలెక్షన్లు రూ.కోటి రూపాయలు దాటాయంటే, ఎవరికైనా ఆశ్చర్యమే. 

రామ్ చరణ్ (Ram Charan), జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR)  కథానాయకులుగా నటించిన ఈ చిత్రంలో.. అల్లూరి, కొమురం భీమ్ పాత్రలలో ఈ ఇద్దరు హీరోలూ ఒదిగిపోయారు. ముఖ్యంగా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి వారిని చూపించిన తీరుకి అభిమానులు ఫిదా అయిపోయారు. ప్యాన్ ఇండియా మూవీగా ఇప్పటికే ఉత్తరాదిలో కూడా సరికొత్త రికార్డులను నమోదు చేసింది RRR.

 

ఇతర దేశాలలో కూడా రామ్ చరణ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు

ఇటీవలే ఓ నేపాల్ వార్తా పత్రిక ఫ్రంట్ పేజీలో RRR ప్రస్తావన వచ్చింది. రామ్ చరణ్ (Ram Charan) ఫోటోని ముఖ చిత్రంగా ప్రచురించిన ఈ పత్రిక కాపీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్చల్ చేస్తోంది. చాలా మంది అభిమానులు ఈ పత్రిక ఫ్రంట్ పేజీని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన RRR చిత్రంలో అలీయా భట్, సముద్రఖని, అజయ్ దేవగన్ ముఖ్య పాత్రలు పోషించారు. డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరించారు. 

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!