Shivani Rajasekhar : మిస్‌ ఇండియా పోటీల్లో రాజశేఖర్‌‌ కూతురు

Updated on Apr 19, 2022 05:20 PM IST
సోమవారం జరిగిన ఫెమీనా మిస్‌ ఇండియా ఆడిషన్స్‌కు హాజరైనట్లు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది
సోమవారం జరిగిన ఫెమీనా మిస్‌ ఇండియా ఆడిషన్స్‌కు హాజరైనట్లు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది

హీరో రాజశేఖర్‌‌ కూతురు మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. రాజశేఖర్‌‌ జీవితలకు ఇద్దరు కూతుళ్లు కాగా.. వారిలో పెద్ద కూతురు శివాని ఇప్పటికే హీరోయిన్‌గా పరిచయమైంది.

ఇక, సోమవారం జరిగిన ఫెమీనా మిస్‌ ఇండియా ఆడిషన్స్​కు ఆమె హాజరైనట్టు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. అలాగే తాను ప్రారంభిస్తున్న కొత్త ప్రయాణంలో అందరి ఆశీర్వాదాలు కావాలని కోరింది.

పోయినేడాది ‘అద్భుతం’ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శివాని.. జీవితా రాజశేఖర్‌‌ దర్శకత్వం చేస్తున్న ‘శేఖర్’లో తండ్రి రాజశేఖర్‌‌తో కలిసి నటించనుంది.

Advertisement
Credits: Google

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!