22 ఏళ్ల ఇండస్ట్రీ @ పూరి జగన్నాథ్ (Puri Jagannadh)
పేక్షకుల పల్స్ తెలిసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్. ప్రతీ సినిమాలో తనదైన మార్క్ చూపిస్తుంటారు. మాస్ మావీలతో వినోదం అందిస్తారు. పూరి జగన్నాథ్ దర్శకుడిగా తన జర్నీ స్టాట్ చేసి సరిగ్గా 22 ఏళ్లు.
పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన మొదటి సినిమా బద్రి. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'బద్రి' అప్పట్లో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. 22 ఏళ్ల క్రితం ఏప్రిల్ 22న 'బద్రి' సినిమా రిలీజ్ అయింది. 'నువ్వు నందు అయితే నేను బద్రి... బద్రినాథ్' అంటూ పవన్ కళ్యాణ్‌తో పూరి చెప్పించిన డైలాగులు.. థియేటర్లలో మోత మోగించేశాయి..
పూరి జగన్నాథ్ దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా చేసిన సినిమా పోకిరి. మహేష్ బాబు హీరోగా చేసిన పోకిరి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.
దర్శకుడు రాంగోపాలవర్మ దగ్గర పూరి జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. డాన్ పాత్రలు చూపించడంలో పూరి స్టైలే సపరేటు. మాస్ కథలతో స్కీన్‌లను రచ్చ రచ్చ చేస్తారు.
పూరి జగన్నాథ్‌కు ఉత్తమ మాటల రచయితగా 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి', 'నేనింతే' సినిమాలకు నంది అవార్డు అందుకున్నారు.ఇడియట్,శివమణి, పోకిరి, బిజినెస్ మ్యాన్, కెమెరామ్యాన్ గంగతో రాంబాబు, చిరుత, టెంపర్, ఇస్మాట్ శంకర్, పైసావసూల్ లాంటి పాపులర్ చిత్రాలకు పూరి దర్శకత్వం వహించారు.
పూరి జగన్నాథ్ ప్రస్తుతం లైగర్ సినిమాకు డైరెక్టర్‌గా చేస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు.
పూరి జగన్నాథ్ కొడుకు ఆకాశ్ పూరి కూడా హీరోగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. తన తండ్రి కాలర్ ఎగరేసుకునేలా తన యాక్టింగ్ చూపిస్తానంటున్నాడు.
పూరి సినిమాల్లో ఎలిమెంట్స్ నచ్చుతాయని... అతని సినిమాలు చూస్తుంటే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందని ఆడియన్స్ అంటుంటారు.దర్శకుడిగా పూరి జగన్నాథ్ మరిన్ని సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేయాలని పింక్‌విల్లా కూడా కోరుకుంటుంది.