Radhe Shyam Updates: రాధేశ్యామ్ ఫ‌ట్ ఎందుకంటే?

Updated on Apr 19, 2022 04:41 PM IST
పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ సినిమా అంటే హిట్లే ఉండాలి. మ‌రి రాధేశ్యామ్ ఎందుకు నెగెటీవ్ టాక్ తెచ్చుకుంది. పాన్ వ‌ర‌ల్డ్ హీరో కానున్న‌ ప్ర‌భాస్ మూవీ ఫెల్యూర్ కారాణాలేంటి.
పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ సినిమా అంటే హిట్లే ఉండాలి. మ‌రి రాధేశ్యామ్ ఎందుకు నెగెటీవ్ టాక్ తెచ్చుకుంది. పాన్ వ‌ర‌ల్డ్ హీరో కానున్న‌ ప్ర‌భాస్ మూవీ ఫెల్యూర్ కారాణాలేంటి.

పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ సినిమా అంటే హిట్లే ఉండాలి. మ‌రి రాధేశ్యామ్ ఎందుకు నెగెటీవ్ టాక్ తెచ్చుకుంది. పాన్ వ‌ర‌ల్డ్ హీరో కానున్న‌ ప్ర‌భాస్ మూవీ ఫెల్యూర్ కారాణాలేంటి.

ప్ర‌బాస్ లుక్ ఎలా ఉంది?
ఏడ‌డుగుల అంద‌గాడు ప్ర‌భాసేన‌ని అభిమానులు అంటారు. ఏ సినిమాలోనైనా హైట్, వెయిట్, లుక్స్‌, కాస్టూమ్స్, మ‌జిల్స్‌తో డార్లింగ్ అదిరిపోతాడు. కానీ రాధేశ్యామ్‌లో ప్ర‌భాస్ లుక్ బాలేద‌ని విమ‌ర్శిస్తున్నారు. కొన్ని స‌న్నివేశాల్లో హెవీ లుక్‌లో క‌నిపించాడు. మేక‌ప్ కూడా అంత బాలేద‌ని టాక్. 

హీరోయిన్ లుక్
టాలీవుడ్ టాప్ స్టార్ పూజా హెగ్డే. స్లిమ్‌గా ఉంటూ సూప‌ర్ యాక్టింగ్ చేస్తారు పూజా. చేసిన సినిమాలు దాదాపు హిట్లే. కానీ రాధేశ్యామ్ సినిమాలో ప్ర‌భాస్‌కు జోడిగా మ్యాచ్ కాలేద‌నే టాక్ న‌డుస్తుంది.

మ్యూజిక్ మైన‌స్..
రాధేశ్యామ్ సినిమాలో ఒక హిట్ సాంగ్ కూడా లేదు. వ‌ర్షం, రాఘ‌వేంద్ర‌, ఛ‌త్ర‌ప‌తి, బాహుబ‌లి... ఇలా చాలావ‌ర‌కు ప్ర‌భాస్ సినిమాల్లో పాట‌లు ఆడియ‌న్స్ మెచ్చేలా ఉన్నాయి. మంచి లిరిక్స్‌తో పాటు రిథ‌మ్ కూడా ప్ల‌స్ అయింది. కానీ ఈ సినిమాలో మ్యూజిక్ మైన‌స్ అయింది. కొన్ని సినిమాలు స్టోరీ ప‌రంగా హిట్ కాక‌పోయిన ఆడియోలు మోత మోగిపోతాయి. రాధేశ్యామ్ పాట‌లు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయాయి.
 
స్టోరీ సంగ‌తి ఏంటి?

విక్ర‌మాదిత్య‌గా జ్యోసం చెప్పిన ప్ర‌భాస్ క్యారెక్ట‌ర్ ఇంకా హైలెట్ చేయాల్సింద‌ని అంటున్నారు సినిమా క్రిటిక్స్. ఫైట్స్, డైలాగ్స్ కూడా ప్ర‌భాస్ స్థాయికి త‌గ్గ‌టుగా లేవు. రొమాన్స్ లేకున్నా సినిమాలు హిట్ అవుతున్నాయి. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ యాడ్ చేసినా యూజ్ లేకుండా పోయింది. 

బ‌డ్జెట్ ఎంత‌?
దాదాపు 350 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి రాధేశ్యామ్ సినిమా తీశారు. సినిమా క్లైమాక్స్ సీన్ కోస‌మే వంద కోట్లు ఖ‌ర్చు చేశారట‌. ఈ సినిమా హిట్ కాక‌పోవ‌డంతో నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూటర్లు న‌ష్ట‌పోయారు. సినిమా టికెట్ కొని సినిమా చూశామ‌ని.. కానీ న‌చ్చ‌క పోవ‌డంతో తాము న‌ష్ట‌పోయామ‌ని కొంద‌రు ప్రేక్ష‌కులు అంటున్నారు.


చిన్న బ‌డ్జెట్ సినిమాలైనా, పెద్ద బ‌డ్జెట్ సినిమాలైనా రెండు గంట‌ల పాటు వినోదం అందించాలి. అప్పుడే ఎలాంటి సినిమా అయినా స‌క్సెస్ అవుతుంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!