Tollywood Dialogues - ఒకే ఒక్క డైలాగ్ చాలు.. ప్రేక్షకుడు ఫిదా అయిపోతాడు

Updated on Apr 19, 2022 04:46 PM IST
డైలాగులు సినిమాకు ప్రాణం. కొన్ని సార్లు సినిమాకంటే ఎక్కువ‌గా అభిమానులు డైలాగులే గుర్తుపెట్టుకుంటారు. మాస్ అయినా  క్లాస్ అయినా   హీరోల హీరోయిజం డ‌బుల్ చేస్తాయి. సినిమాల్లో గుర్తుండిపోయే డైలాగులేంటో తెలుసుకుందాం.

కేజీఎఫ్2

హీరో - య‌ష్

డైలాగ్ రైట‌ర్ - య‌ష్, ప్రశాంత్ నీల్ 

గుర్తుండిపోయే డైలాగులు:

'ఇక్క‌డ త‌లలు శాశ్వ‌తం కాదు. కిరీటాలు మాత్ర‌మే శాశ్వ‌తం.నెపోటిజం, నెపోటిజం, నెపోటిజం…మెరిట్‌ను ఎద‌గ‌నివ్వ‌రా ?'.

'రక్తం తో రాసిన కథ ఇది.సిరాతో తీసుకెళ్లలేమ్.ముందుకెళ్లాలంటే మళ్లీ రక్తాన్నే కోరుకుంటుంది'.

ఆర్ ఆర్ ఆర్ 

హీరోలు- రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్

డైలాగ్ రైట‌ర్ - సాయిమాధ‌వ్ బుర్రా

గుర్తుండిపోయే డైలాగులు:

'రామ్ చ‌ర‌ణ్-  భీమ్ .. ఈ న‌క్క‌ల వేట ఎంత సేపు కుంభ‌స్థ‌లాన్ని బ‌ద్ధ‌లు కొడ‌దాం ప‌దా'.

'ఎన్టీఆర్- తొంగి.. తొంగి.. న‌క్కి.. న‌క్కి గాదే తొక్కుకుంటూ పోవాలే. ఎదురొచ్చినోడ్ని ఏసుకుంటూ పోవాలే'.

పుష్ప 

హీరో- అల్లు అర్జున్

డైలాగ్ రైట‌ర్ - శ్రీకాంత్ విస్పా

గుర్తుండిపోయే డైలాగులు:

'పుష్ప అంటే ఫ్ల‌వ‌ర‌నుకొంటివా... ఫైరు... త‌గ్గేదేలే'.

ఈ లోకం మీకు తుపాకి ఇచ్చింది. నాకు గొడ్డ‌లి ఇచ్చింది. ఎవ‌డి యుద్ధం వాడిదే

అఖండ‌

హీరో- బాల‌కృష్ణ‌

డైలాగ్ రైట‌ర్ - క‌ళ్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి

గుర్తుండిపోయే డైలాగులు:

'ఒక‌సారి డిసైడ్ అయి బ‌రిలోకి దూకితే.. బ్రేకుల్లేని బుల్డోజ‌ర్ని.. తొక్కిపార‌దొబ్బుతా....',

'కాలుదువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.. కారు కూత‌లు కూస్తే క‌పాలం ప‌గిలిపోద్ది'.

భీమ్లా నాయ‌క్

హీరో- ప‌వ‌న్ క‌ళ్యాణ్

డైలాగ్ రైట‌ర్ - త్రివిక్ర‌మ్ శ్రీనివాస్

గుర్తుండిపోయే డైలాగు:

'నేను ఇవ‌త‌ల ఉంటే చ‌ట్టం.. అవ‌త‌ల‌కి వ‌స్తే క‌ష్టం వాడికి'.

సైరా  
హీరో- చిరంజీవి
డైలాగ్ రైట‌ర్ -  సాయిమాద‌వ్ బుర్రా
గుర్తుండిపోయే డైలాగులు:
'గడ్డి పరక కూడా గడ్డ దాటకూడదు... చంపడం చావడం ముఖ్యం కాదు.. గెలవడం ముఖ్యం'.
'స్వాతంత్య్రం ఒక్కటే మన లక్ష్యం',

స‌రిలేరు నీకెవ్వ‌రు

హీరో- మ‌హేష్ బాబు

డైలాగ్ రైట‌ర్ - అనిల్ రావిపూడి

గుర్తుండిపోయే డైలాగులు:

'ర‌మ‌ణా లోడ్ ఎత్తాలిరా.. చెక్ పోస్ట్ ప‌డ‌తాది'.

'గాయం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడు బాబాయ్'.

'అబ్బబ్బాబాబా.... ఇలాంటి డ్రామాలు నెవ‌ర్ బివోర్.. ఎవ‌ర్ ఆఫ్ట‌ర్'.

సినిమాలో పంచ్ డైలాగులు కొన్ని వైర‌ల్ అవుతుంటాయి. చిన్నా, పెద్దా తేడాలేకుండా ప్రేక్ష‌కులు పంచుల‌ను పేలుస్తుంటారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!