విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ (Pooja Hegde)

Updated on May 14, 2022 05:03 PM IST
టాప్ హీరోల‌తో హిట్ సినిమాల్లో న‌టించిన బ్యూటీ పూజ హెగ్డే (Pooja Hegde)కు మ‌రో పాన్ ఇండియా సినిమాలో అవ‌కాశం వ‌చ్చింది. వ‌రుస ఫ్లాపుల్లో నిరాశ‌తో ఉన్న పూజ హెగ్డేకు మూవీ ఆఫ‌ర్స్ ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు.
టాప్ హీరోల‌తో హిట్ సినిమాల్లో న‌టించిన బ్యూటీ పూజ హెగ్డే (Pooja Hegde)కు మ‌రో పాన్ ఇండియా సినిమాలో అవ‌కాశం వ‌చ్చింది. వ‌రుస ఫ్లాపుల్లో నిరాశ‌తో ఉన్న పూజ హెగ్డేకు మూవీ ఆఫ‌ర్స్ ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు.

టాప్ హీరోల‌తో హిట్ సినిమాల్లో న‌టించిన బ్యూటీ పూజ హెగ్డే (Pooja Hegde)కు మ‌రో పాన్ ఇండియా సినిమాలో అవ‌కాశం వ‌చ్చింది. వ‌రుస ఫ్లాపుల్లో నిరాశ‌తో ఉన్న పూజ హెగ్డేకు మూవీ ఆఫ‌ర్స్ ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడిగా పూజ హెగ్డే న‌టించ‌నున్నారు. 

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ జేజీఎం. ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి న‌టించ‌నున్నారు పూజా హెగ్డే. త్వ‌ర‌లో అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంది. 

పూజ హెగ్డే(Pooja Hegde) టాప్ హీరోల‌తో క‌లిసి న‌టించారు. ప్ర‌భాస్, మ‌హేష్, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్, అల్లు అర్జున్, నాగ చైత‌న్య‌ల సినిమాల్లో న‌టించారు. టాప్ హీరోల‌తో న‌టించి మోప్పించిన పూజ ఈ మ‌ధ్య వ‌రుస ప్లాపుల‌తో డీలా ప‌డింది. ఆచార్య‌, బీస్ట్ సినిమాలు పూజ హెగ్డేకు డిజాస్ట‌ర్‌గా నిలిచాయి. కానీ త‌న ఫాలోయింగ్ మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌లేదు. 

Pooja Hegde

మాస్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ సినిమా లైగ‌ర్ త‌ర్వాత జేజీఎం సినిమా తీయ‌నున్నారు. ఆ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొంద‌, పూజ హెగ్డే హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. జేజీఎం సినిమాలో ముందు అందాల తార శ్రీదేవి కూత‌రు జాన్వీ క‌పూర్ అనుకున్నారు. కానీ కుద‌ర‌క పోవ‌డంతో పూజ హెగ్డేను హీరోయిన్‌గా డిసైడ్ చేశారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో జ‌త క‌ట్టేందుకు బుట్ట‌బొమ్మ(Pooja Hegde) కూడా ఓకే చెప్పేసింది. 

పూజా హెగ్డేకు తెలుగు, త‌మిళంతో పాటు హిందీలోనూ పేరుంది. జేజీఎం మూవీ కోసం పూజ హెగ్డేను సెల‌క్ట్ చేయ‌డం పూరీ జ‌గన్నాథ్‌కు ప్ల‌స్ అవుతుంద‌ని టాక్. ఇక పాన్ ఇండియా సినిమాల్లో పూజ హెగ్డే అద‌ర‌గొట్ట‌నున్నారు. 

Pooja Hegde

కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్ వేడుక‌ల‌కు పూజ

సౌత్ స్టార్‌గా దూసుకెళుతున్న పూజ హెగ్డే (Pooja Hegde) తొలి సారి కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్ వేడుక‌ల‌కు హాజ‌ర‌వుతున్నారు. ఫ్రాన్స్‌లో జ‌రిగే 75వ కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్‌కు పూజ‌తో పాటు అక్ష‌య్ కుమార్, త‌మ‌న్నా, మాధ‌వ‌న్ హాజ‌ర‌వుతున్నారు. భార‌త దేశ ప్ర‌తినిధిగా పూజ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా క‌నిపించ‌నున్నారు. పూజ హెగ్డె ఎలాంటి మేక‌ప్‌, కాస్ట్యూమ్స్‌లో వేడుక‌ల్లో మెర‌వ‌నుందో చూడాలి.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!