మార్ష‌ల్ ఆర్ట్స్‌లో ప‌వన్‌ కళ్యాణ్‌‌కు (Pawan Kalyan) ట్రైనింగా?

Updated on Apr 21, 2022 04:35 PM IST
Pawan Kalyan
Pawan Kalyan

'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' మూవీ కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ వెరైటీ గెట‌ప్పుల్లో క‌నిపించ‌నున్నారు. మార్ష‌ల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. పాన్ ఇండియా సిన‌మాగా నిల‌బెడ‌తాన‌ని ద‌ర్శ‌కుడు క్రిష్ అంటున్నారు.

 

Hari Hara Veeramallu

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తుతం 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్  ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' మూవీని తెర‌కెక్కిస్తున్నారు.  'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' సినిమా ఇప్ప‌టికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. కొత్త షెడ్యూల్ షూటింగ్ మొద‌లైంది. పెద్ద సినిమా సెటింగ్స్ వేశార‌ట‌. కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. 

Hari Hara Veeramallu

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ సినిమాగా క్రిష్ కొత్త కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిస్తున్నార‌ట‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ 30 ర‌కాల డ్రెస్సుల్లో క‌నువిందు చేయ‌బోతున్నార‌ట‌. మార్ష‌ల్ ఆర్ట్స్  ట్రైనింగ్‌పై ప‌వ‌న్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టారు.సుమారు వేయి మంది ఆర్టిస్టుల‌తో ఫైట్ సన్నివేశాల ఉంటాయ‌ని టాక్. ప‌వ‌న్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్ న‌టిస్తోంది. ఈ చిత్రానికి ఎంఎం కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు.బాలీవుడ్ న‌టుడు అర్జున్ రాంపాల్‌, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ న‌టిస్తున్నారు.

 

Hari Hara Veeramallu

ప‌వ‌న్ క‌ల్యాణ్ మూడు పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నార‌ట‌. హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు పాత్రే హైలట్‌గా నిలుస్తుంది. 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' సినిమా తెలుగు,హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో రిలీజ్ కానుంది. వ‌కీల్ సాబ్, బీమ్లా నాయ‌క్ త‌ర్వాత ప‌వ‌న్ హ్యాట్రిక్ హ‌ట్ కోసం వెయిట్ చేస్తున్నార‌ట‌.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!