Pawan Kalyan: త‌న దేవుడు ప‌వ‌న్ మామ అంటున్న సాయిధ‌ర‌మ్ తేజ్‌!

Updated on May 11, 2022 10:30 PM IST
Pawan Kalyan: ప‌వ‌న్ క‌ల్యాణ్ దేవుడిగా యాక్ట్ చేస్తున్న త‌మిళ్ రీమేక్ సినిమాలో  సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టిస్తున్నారు.
Pawan Kalyan: ప‌వ‌న్ క‌ల్యాణ్ దేవుడిగా యాక్ట్ చేస్తున్న త‌మిళ్ రీమేక్ సినిమాలో  సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టిస్తున్నారు.

Pawan Kalyan: మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన హీరో సాయిధ‌ర‌మ్ తేజ్. డిఫ‌రెంట్ సినిమాల‌తో సాయిధ‌ర‌మ్ ప్రేక్ష‌కులకు ద‌గ్గ‌ర‌య్యాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ దేవుడిగా యాక్ట్ చేస్తున్న త‌మిళ్ రీమేక్ సినిమాలో  సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టిస్తున్నారు.

త‌మిళ్ సినిమా వినోద‌య సీతం తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) హీరోగా న‌టిస్తున్నారు. దేవుడి పాత్ర‌లో ప‌వ‌న్ కల్యాణ్ క‌నిపిస్తార‌ట‌. సాయిధ‌ర‌మ్ తేజ్ కూడా ఈ సినిమాలో కీల‌క రోల్ చేస్తున్నార‌ట‌. ప్ర‌ముఖ విల‌న్ స‌ముద్ర‌ఖ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వినోదయ సీతం త‌మిళ్ సినిమా రీమేక్‌కు ఇంకా టైటిల్ రిలీజ్ చేయ‌లేదు. ప‌వ‌న్ కల్యాణ్ పాత్రే ఈ సినిమాకు హైలెట్ అట‌. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ5 క‌లిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. 

Pawan Kalyan

త‌మిళ్ న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని వినోద‌య సీతంలో న‌టించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) దేవుడిగా, అత‌ని మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ మ‌రో ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తున్నారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ కథనం, మాటలను అందిస్తున్నారు. త్రివిక్ర‌మ్ ప‌వ‌న్ సినిమాకు నిర్మాత‌గా కూడా మార‌నున్నార‌ట‌. ప‌వన్ క‌ల్యాణ్ తన సొంత బ్యానర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్‌పై ఈ సినిమా తీస్తారంటున్నారు. 

సినిమా క‌థ‌
ఓ ప్రైవేట్ కంపెనీ మేనేజ‌ర్ కార్ యాక్సిడెంట్‌లో చ‌నిపోతాడు.. ఆ చ‌నిపోయిన వ్య‌క్తి ఆత్మ తీసుకెళ్ల‌డానికి దేవుడు వ‌స్తాడు. చ‌నిపోయిన వ్య‌క్తికి కొన్ని ఆశయాలు ఉన్నాయ‌ని దేవుడికి చెబుతాడు. కొంత స‌మ‌యం త‌ర్వాత చావు ఇవ్వ‌మ‌ని దేవుడిని అడుగుతాడు. చావును మూడు నెల‌లు పోస్టు పోన్ చేసిన దేవుడిని ఇంకేం చేయ‌మంటాడ‌నే క‌థ‌నంతో  వినోద‌య సీతం మూవీ సాగుతుంది. 
 
ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) సినిమాల‌తో బిజీగా ఉన్నారు. భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్, హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు వ‌రుస సినిమాల‌తో అభిమానుల‌కు వినోదం పంచ‌నున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!