ఎన్టీఆర్ (NTRamarao) శ‌త జ‌యంతి సంద‌ర్భంగా నివాళులు అర్పించిన జూనియ‌ర్ ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్

Updated on May 28, 2022 01:40 PM IST
NTRamarao: జూనియ‌ర్ ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ స‌మాధి వ‌ద్ద పుష్ఫ గుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. 
NTRamarao: జూనియ‌ర్ ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ స‌మాధి వ‌ద్ద పుష్ఫ గుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. 

NTRamarao: మ‌హాన‌టుడు నంద‌మూరి తార‌క రామారావు శ‌త జ‌యంతి నేడు. తాత జ‌యంతి సంద‌ర్భంగా జూనియ‌ర్ ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ నివాళులు అర్పించారు. శ‌నివారం తెల్లవారుజామున ఎన్టీఆర్ స‌మాధిని సంద‌ర్శించారు. ఎన్టీఆర్ స‌మాధి వ‌ద్ద పుష్ఫ గుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. న‌ట‌న‌తోనే కాకుండా తెలుగు ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌ని ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. ‘తెలుగుదేశం’ పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్య‌మంత్రి అయ్యారు. మే 28, 1923న ఎన్టీఆర్ జ‌న్మించారు. ఈ సంవ‌త్స‌రం శ‌త జ‌యంతి సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యులు, అభిమానులు మ‌హాన‌టుడికి పెద్ద సంఖ్యలో నివాళులు అర్పిస్తున్నారు. 

 

 NTRamarao:మ‌హా న‌టుడు నంద‌మూరి తార‌క రామారావు శ‌త జ‌యంతి నేడు

జూనియ‌ర్ ఎన్టీఆర్ (NTR) త‌న తాత‌ను సోష‌ల్ మీడియా ద్వారా గుర్తుచేసుకున్నారు. త‌న తాత లాంటి న‌టుడు, రాజ‌కీయ నేత మరొకరు ఉండ‌ర‌ని ఎన్టీఆర్ చెబుతుంటాడు. సీనియ‌ర్ ఎన్టీఆర్‌కు, జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు మ‌ధ్య ఉన్న అనుబంధం చాలా గొప్ప‌ది. జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను న‌ట‌న వైపు అడుగులు వేయించారు. ఎన్టీఆర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన  బ్ర‌హ్మ‌ర్షి విశ్వామిత్ర‌లో భ‌ర‌తుడి పాత్ర‌ చేయించారు అలనాటి మహానటుడు. ఆ త‌ర్వాత గుణశేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బాల రామాయ‌ణంలో రాముడిగా న‌టించిన జూనియర్‌‌  ఎన్టీఆర్ ..నంది అవార్డును సొంతం చేసుకుని నటనలో తాత‌కు త‌గ్గ మ‌నువ‌డు అనిపించుకున్నాడు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!