Karthikeya2: 2 రోజుల్లో 100 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్‌.. ఓటీటీలోనూ దూసుకెళుతున్న నిఖిల్‌ (Nikhil) కార్తికేయ2

Updated on Oct 08, 2022 05:41 PM IST
నిఖిల్ (Nikhil) కార్తికేయ2 సినిమా బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. దసరా సందర్భంగా ఓటీటీలోకి విడుదలై రికార్డులు సృష్టిస్తోంది
నిఖిల్ (Nikhil) కార్తికేయ2 సినిమా బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. దసరా సందర్భంగా ఓటీటీలోకి విడుదలై రికార్డులు సృష్టిస్తోంది

Karthikeya2: చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌ అందుకున్న సినిమా నిఖిల్ (Nikhil) హీరోగా నటించిన కార్తికేయ2. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. నిఖిల్‌ హీరోగా నటించిన కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా కార్తికేయ2 తెరకెక్కింది. విడుదల తేదీ మార్పుతో ఆగస్టు 13వ తేదీన రిలీజైన కార్తికేయ2 సంచలన విజయం సాధించింది. తెలుగుతోపాటు విడుదలైన అన్ని భాషల్లోనూ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.

ఆమిర్‌‌ ఖాన్‌ హీరోగా నటించిన లాల్‌ సింగ్‌ చద్దా, అక్షయ్ కుమార్ హీరోగా చేసిన రక్షాబంధన్ సినిమాలకు పోటీగా హిందీలో కూడా మంచి వసూళ్లు సాధించి రేసులో నిలిచింది కార్తికేయ2. సుమారు రూ.120 కోట్లు కొల్లగొట్టి నిఖిల్ కెరీర్‌‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది.  

నిఖిల్ (Nikhil) కార్తికేయ2 సినిమా బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. దసరా సందర్భంగా ఓటీటీలోకి విడుదలై రికార్డులు సృష్టిస్తోంది

అతి తక్కువ సమయంలో..

ఇక, కార్తికేయ2 సినిమా విజయ దశమి కానుకగా బుధవారం ఓటీటీలో రిలీజ్ అయ్యింది. థియేటర్లతో రికార్డులు సృష్టించిన కార్తికేయ2 సినిమా ఓటీటీలో కూడా రికార్డులు సృష్టిస్తోంది. మిస్టరీ యాక్షన్ అడ్వంచరస్‌ సినిమాగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ2.. జీ5 ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. విడుదలైన రెండు రోజుల్లో 100 కోట్ల స్ట్రీమింగ్‌ మినిట్స్‌ను సొంతం చేసుకుంది. జీ5లో అతి తక్కువ సమయంలో 100 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్‌ సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది కార్తికేయ2.

కార్తికేయ2 (Karthikeya2) సినిమాలో నిఖిల్‌ (Nikhil) సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించారు. ప్రస్తుతం కార్తికేయ3 సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. కార్తికేయ3 సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ జరుగుతోందని సమాచారం. వీలైనంత త్వరగా కార్తికేయ3 సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.  

Read More : నిఖిల్‌ (Nikhil) హీరోగా నటించిన కార్తికేయ2 సినిమాపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) కామెంట్లు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!