మహేష్‌బాబు (MaheshBabu) – త్రివిక్రమ్ సినిమాలో నందమూరి నటుడు తారకరత్న?

Updated on May 29, 2022 01:47 PM IST
నందమూరి తారకరత్న, త్రివిక్రమ్, మహేష్‌బాబు (MaheshBabu)
నందమూరి తారకరత్న, త్రివిక్రమ్, మహేష్‌బాబు (MaheshBabu)

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) సినిమా అంటేనే అభిమానులకు పండుగ. ఇక, అందులోనూ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తమ హీరో సినిమా చేయబోతున్నాడు అంటే అభిమానుల జోష్‌ ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు మహేష్‌ అభిమానులనే కాకుండా సినీ ప్రియులను కూడా ఎంతగా అలరించాయో తెలిసిందే.

ఈ రెండు సినిమాలు వచ్చి చాలా కాలం అయ్యింది. అప్పటి నుంచి వీరిద్దరి కాంబినేషన్‌లో మళ్లీ ఎప్పుడు సినిమా వస్తుందా అని మహేష్‌ అభిమానులు ఎదురుచూస్తున్నారు. వారి వెయిటింగ్‌కు ఫుల్‌స్టాప్‌ పెడుతూ మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ కలిసి సినిమా చేయబోతున్నట్టు ప్రకటించింది చిత్ర యూనిట్‌. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది.

ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. నందమూరి నటుడు తారకరత్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. తారకరత్న పేరుతో ఉన్న ఒక ట్విట్టర్‌‌ అకౌంట్‌లో #SSMB 28 Loading అని తాజాగా ఓ ట్వీట్‌ బయటకువచ్చింది. అది చూసిన నెటిజన్లు.. మహేష్ సినిమాలో తారకరత్న నటిస్తున్నాడని అనుకుంటున్నారు. అయిఏ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. SSMB 28గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్‌ఎస్‌ థమన్ మ్యూజిక్‌ అందించనున్నాడు.

కాగా, మహేష్‌బాబు (MaheshBabu) హీరోగా, కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా తెరకెక్కిన సినిమా సర్కారు వారి పాట. పరశురాం డైరెక్షన్‌ చేసిన ఈ సినిమా ఇటీవలే రిలీజై బాక్సాఫీస్ దగ్గర సూపర్‌‌హిట్‌ టాక్ సొంతం చేసుకుంది. రిలీజ్‌ అయిన అన్ని సెంటర్లలో మంచి వసూళ్లు రాబడుతోంది. ఓవర్‌‌సీస్‌లో కూడా సినిమా వసూళ్లు భారీగానే ఉన్నాయని చిత్ర యూనిట్‌ చెబుతోంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!