తన లిమిట్స్​పై సితార(Sitara)కు క్లారిటీ ఉందన్న నమ్రత (Namrata)

Updated on Apr 21, 2022 07:55 PM IST
Sitara on her 9th Birthday
Sitara on her 9th Birthday

సితార ఘట్టమనేని.. సూపర్‌‌స్టార్ కృష్ణ మనుమరాలు.. మహేష్‌బాబు, నమ్రతా శిరోద్కర్‌‌ల గారాల కూతురు. వీటిన్నింటి కంటే కూడా తనకంటూ ఒక క్రేజ్‌ను సంపాదించుకుంది ఈ తొమ్మిదేండ్ల చిన్నారి. సితారను మల్టీ టాలెంటెడ్ కిడ్‌ అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అదే సమయంలో తన తాత, తండ్రికి ఉన్న క్రేజ్‌కు ఏ మాత్రం తగ్గకుండా అన్నింటిలోనూ బెస్ట్‌ అని నిరూపించుకుంటోంది.

అయితే ఇంత చిన్న వయసులో తనకు వచ్చే పాపులారిటీ, మీడియా అటెన్షన్‌ గురించి తాము ఏ మాత్రం భయపడడం లేదని అంటోంది మాజీ మిస్‌ ఇండియా అయిన సితార తల్లి నమ్రత.

ప్రస్తుతం సితారకు 9 సంవత్సరాలు మాత్రమే. అన్ని విషయాల్లో తన లిమిట్స్ తనకు తెలుసునని ఇటీవల నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నమ్రత చెప్పింది. ఏ పని ఎప్పుడు,  ఎలా చేయాలి అనే విషయాలపై సితారకు అండగా తాను, మహేష్‌ ఉన్నామని తెలిపింది. అయినా ఏం చేయాలి ఏది చేయకూడదు అనే దానిపై సితారకు క్లారిటీ ఉందని చెప్పుకొచ్చింది.

మహేష్‌బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో ఒక పాట ప్రోమోలో సితార చేసిన డ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది.  ఆ పాటలో సితార యాటిట్యూడ్, డ్యాన్స్​పై ప్రశంసల జల్లు కురిపించారు కూడా.  

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!