కేజీఎఫ్‌ (KGF) హీరో యశ్‌ (Yash)పై హత్యాయత్నం

Updated on Apr 22, 2022 09:16 PM IST
కేజీఎఫ్‌ హీరో యశ్‌
కేజీఎఫ్‌ హీరో యశ్‌

కేజీఎఫ్‌ సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌‌గా క్రేజ్ స్టేటస్ తెచ్చుకున్నాడు యశ్‌. దీంతో కేజీఎఫ్‌–2పై భారీగా అంచనాలు పెరిగాయి. అంచనాలకు తగినట్టుగానే రిలీజైన అన్ని భాషల్లోనూ సినిమా భారీ కలెక్షన్లు సాధిస్తోంది. వసూళ్ల సునామీ సృష్టిస్తూ రికార్డులు బద్దలు కొడుతోంది. వారం రోజుల సమయంలోనే సుమారు రూ.600 కోట్లు వసూలు చేసింది.

తెలుగులో కూడా దాదాపు వెయ్యి కోట్లు కలెక్ట్‌ చేసి కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక, ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌, బాహుబలి రికార్డులను తిరగరాసే స్పీడ్‌తో దూసుకుపోతోంది కేజీఎఫ్‌2.

ఇక, కేజీఎఫ్‌ రెండు భాగాల్లోనూ పవర్‌‌ఫుల్‌ క్యారెక్టర్‌‌లో నటించిన యశ్‌పై హత్యాయత్నం జరిగింది. అయితే అది ఇప్పుడు కాదు. అతను పాన్‌ ఇండియా స్టార్ కాకముందు. ఈ విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది. హీరో యశ్‌పై రౌడీ షీటర్ స్లమ్‌ భరత్‌ అనే వ్యక్తి హత్యాయత్నానికి ప్రయత్నించినట్టు ఇంటలిజెన్స్ వర్గాలు సమాచారం ఇచ్చాయట.

ఇక, ఆ తరువాత జరిగిన పరిణామాల్లో ఏదో ఒక కేసు విషయంలో పోలీసులతో వాగ్వాదం జరగడంతో స్లమ్‌ భరత్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌‌ చేశారని తెలిసింది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!