చిరంజీవిని (Chiranjeevi) మురళీమోహన్ (Murali Mohan) అలా ఎందుకన్నారో?
కళామ్మతల్లి బిడ్డలకు కష్టం వస్తే సహాయం చేసేందుకు ముందుటానని చిరు చెప్తుంటారు. కానీ చిరు సినిమా పెద్దగా ఉండనన్నారని మురళీ మోహన్ అంటున్నారు. మురళీ మోహన్ అసలు ఏమన్నారంటే...
దార్శక రత్న దాసరి నారాయణరావు మరణం తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఆ సమయంలో ఎవరు పెద్దగా ఉంటారనే దానిపై రకరకాల వార్తలు వచ్చాయి. కోవిడ్ టైంలో టాలీవుడ్‌కి అండగా నిలబడిన చిరంజీవిని సినీ పెద్దగా ఉండమన్నారు. కానీ ఆ తర్వాత జరిగిన మా ఎలక్షన్‌లో చిరు సపోర్ట్ చేసిన ప్రకాశ్ రాజ్ ఓడిపోయారు.
మంచు మోహన్ బాబు సినీ పెద్దగా వ్యవహరించాలని సీనియర్ నరేష్ అన్నారు. మంచు విష్ణు మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్‌కు పోటీగా నిలబడ్డారు. మంచు విష్ణు గెలిచి మా అధ్యక్షుడు అయ్యారు. మా ఎలక్షన్ల తర్వాత సినిమా పెద్ద ఎవరనే దానిపై పెద్ద చర్చే మొదలైంది.
'మా' డైరీ రిలీజ్ ఫంక్షన్లో చిరంజీవిని ఇండ్రస్టీకి పెద్దగా ఉండమని కోరానని మురళీ మోషన్ అన్నారు. అయితే సినిమాలతో బిజీగా ఉంటున్న చిరంజీవి దగ్గరకు చిన్న, చిన్న గొడవలు తీర్చమని కూడా వెళుతున్నారన్నారు. దీంతో తాను ఇండస్ట్రీ పెద్దగా కాకుండా బిడ్డగా ఉంటానని చిరంజీవి అన్నారని మురళీ మోహన్ చెప్పారు.