Movie Review : బిగ్‌బాస్ ఫేమ్‌ అషు రెడ్డి (Ashu Reddy) నటించిన ‘ఫోకస్‌’.. ఓకే అనిపించేలా మర్డర్‌‌ మిస్టరీ

Updated on Oct 28, 2022 04:27 PM IST
బిగ్‌బాస్‌ బ్యూటీ అషు రెడ్డి (Ashu Reddy) హీరోయిన్‌గా నటించిన ‘ఫోకస్’ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది
బిగ్‌బాస్‌ బ్యూటీ అషు రెడ్డి (Ashu Reddy) హీరోయిన్‌గా నటించిన ‘ఫోకస్’ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది

సినిమా : ఫోకస్‌

నటీనటులు : విజయ్‌ శంకర్, అషు రెడ్డి (Ashu Reddy)

దర్శకుడు : జి.సూర్య తేజ

మ్యూజిక్ : వినోద్‌ యాజమాని

నిర్మాత : పి.వీరభద్ర రావు

విడుదల తేదీ : 28–10–2022

రేటింగ్ : 3 / 5

బిగ్‌బాస్‌ బ్యూటీ అషు రెడ్డి (Ashu Reddy) పోలీస్ ఆఫీసర్‌‌గా, యంగ్‌ హీరో విజయ్ శంకర్‌‌ హీరోగా నటించిన సినిమా ఫోకస్. మర్డర్‌‌ మిస్టరీగా తెరకెక్కిన ఈ సినిమాకు సూర్య తేజ దర్శకత్వం వహించారు. భానుచందర్, సుహాసిని మణిరత్నం కీలకపాత్రలు పోషించారు. బిగ్‌బాస్‌ గ్లామర్ సెన్సేషన్‌ నటిస్తున్న సినిమా కావడంతో సినిమాపై పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. శుక్రవారం ఫోకస్ సినిమా థియేటర్లలో విడుదలైంది.

 కథ ఏంటంటే?

వివేక్‌ వర్మ (భాను చందర్‌‌), ప్రమోదా దేవి (సుహాసిని మణిరత్నం) భార్యాభర్తలు. వివేక్‌ వర్మ ఎస్పీ కాగా ప్రమోదా దేవి జడ్జి. వీరిద్దరూ ఒక రోజు గెస్ట్‌ హౌస్‌కు వెళ్తారు. అక్కడ వివేక్‌ వర్మ హత్య జరుగుతుంది. ఆ హత్యకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్‌ను ఎస్‌ఐ విజయ్‌ శంకర్‌‌కు అప్పగిస్తారు సీపీ (షాయాజీ షిండే), డీసీపీ (జీవా). వివేక్ వర్మను హత్య చేసింది తానేనని పోలీసులకు లొంగిపోతాడు సూర్య భగవాన్. ఆరేళ్ల క్రితం తన కూతురు రేప్‌, హత్య కేసులో కక్షతోనే హత్య చేసినట్టు చెబుతాడు సూర్యభగవాన్. అంతలోనే డబ్బు కోసం తానే వివేక్ వర్మను హత్య చేశానని చెప్తుంది గెస్ట్‌ హౌస్‌లో పని మనిషి. ఇక్కడితో కేస్ క్లోజ్ అయ్యిందని అందరూ అనుకుంటారు. అయితే పోస్ట్ మార్టం రిపోర్టులో మాత్రం విషం తీసుకోవడం వలనే వివేక్ వర్మ మరణించినట్టు తెలుస్తుంది. అసలు హత్య చేసింది ఎవరు? ప్రమోదా దేవికి, సూర్య భగవాన్ కూతురికి ఉన్న సంబంధం ఏమిటి అనేది మిగిలిన సినిమా కథ.

బిగ్‌బాస్‌ బ్యూటీ అషు రెడ్డి (Ashu Reddy) హీరోయిన్‌గా నటించిన ‘ఫోకస్’ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది

ఎలా ఉందంటే?  

మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కించిన ఫోకస్‌ సినిమా ఆద్యంతం ట్విస్ట్‌లతో సాగుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్‌‌ సినిమాలో ఉండాల్సినన్ని ట్విస్టులు ఈ సినిమాలో ఉన్నాయి. సినిమా మొదటి భాగంలో కథ నడుస్తూనే ఉన్నా.. ట్విస్ట్‌లు అంతగా ఉత్కంఠగా అనిపించవు. అయితే సెకండ్‌ హాఫ్‌లో ట్విస్ట్‌లు సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. కథ కూడా వేగంగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్‌ హాఫ్‌లో కొంత బోర్ ఫీల్‌ అయిన ప్రేక్షకుడికి సెకండ్‌ హాఫ్‌లో ఆ ఫీలింగ్ అస్సలు రాకుండా సినిమాను నడిపించారు దర్శకుడు సూర్యతేజ. స్క్రీన్‌ప్లే విషయంలో మరింత జాగ్రత్త వహించి ఉంటే బాగుంటుందని అనిపించింది. మిస్టరీ, థ్రిల్లింగ్ సినిమాలకు ముఖ్యంగా కావాల్సింది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. ఈ విషయంలో దర్శకుడు పెద్దగా ఫోకస్ పెట్టలేదని అనిపిస్తుంది.  

ఎవరెలా నటించారంటే?

యంగ్‌ హీరో విజయ్‌ శంకర్ పోలీస్‌ ఆఫీసర్‌‌గా ఫర్వాలేదనిపించారు. ఇక, సుహాసినీ మణిరత్నం నటన గురించి చెప్పాల్సిన పనిలేదు. తన పరిధి మేరకు ఆమె క్యారెక్టర్‌‌లో బాగానే ఒదిగిపోయారు సుహాసిని. భానుచందర్‌‌ క్యారెక్టర్ ఎక్కువసేపు లేనప్పటికీ ఆయన కూడా బాగానే నటించారు. ఇక, ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్‌‌గా నటించిన బిగ్‌బాస్‌ ఫేమ్ అషు రెడ్డి (Ashu Reddy) తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. భరత్‌రెడ్డి, జీవా తదితరులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

ప్లస్ పాయింట్స్ : కథ, ట్విస్ట్‌లు, కథను నడిపించిన తీరు

మైనస్ పాయింట్లు : బ్యాక్‌ గ్రౌండ్ మ్యాజిక్, స్క్రీన్‌ ప్లే

ఒక్క మాటలో .. క్రైమ్ థ్రిల్లర్‌‌ ఇన్వెస్టిగేషన్‌పై మరింత ‘ఫోకస్’ పెట్టాల్సింది.

Read More : బిగ్ బాస్ (Boggboss Nonstp) స్టేజీ మీదే హోస్ట్ నాగార్జున‌కు ముద్దుపెట్టిన అషూరెడ్డి!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!