రోడ్డుపై సినిమా ప్రమోషన్స్‌.. మరో వివాదంలో విశ్వక్‌సేన్‌ (Vishwak Sen)

Updated on May 02, 2022 06:21 PM IST
అశోక వనంలో అర్జున కల్యాణం సినిమాలో విశ్వక్‌ సేన్ (Vishwak Sen), రుష్కర్‌‌ ధిల్లాన్
అశోక వనంలో అర్జున కల్యాణం సినిమాలో విశ్వక్‌ సేన్ (Vishwak Sen), రుష్కర్‌‌ ధిల్లాన్

వెరైటీ కథలను సెలెక్ట్ చేసుకుంటూ విభిన్నమైన సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు విశ్వక్‌సేన్ (Vishwak Sen). ప్రస్తుతం విశ్వక్‌ నటించిన అశోకవనంలో అర్జున కల్యాణం సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 6వ తేదీన రిలీజ్‌ కాబోతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో విశ్వక్ బిజీబిజీగా గడుపుతున్నాడు. మాస్‌ హీరోగా ముద్ర వేయించుకున్న విశ్వక్.. ఈ సినిమాతో క్లాస్ ప్రేక్షకులకు దగ్గరవ్వడానికి ప్లాన్ చేస్తున్నాడు.

మరో నాలుగు రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో ప్రమోషన్స్‌ను స్పీడప్‌ చేసింది చిత్ర యూనిట్.ఇందులో భాగంగా ఒక యువకుడితో కలిసి విశ్వక్‌సేన్‌ రోడ్డుపై ప్రాంక్ వీడియో చేశాడు. అది కాస్తా రచ్చ రచ్చ అయ్యింది. రోడ్డుపై ప్రాంక్‌ వీడియో చేయడంపై పలువురు విశ్వక్‌పై మండిపడుతున్నారు. కొందరైతే.. ప్రమోషన్స్‌ కోసం ఇంతకు దిగజారుతారా అని విమర్శలు కూడా చేస్తున్నారు. అది కాకుండా ఇప్పుడు విశ్వక్‌కు మరో తలనొప్పి వచ్చి పడింది.

తన ప్రాంక్ వీడియో కోసం ఓ యువకుడ్ని తీసుకొచ్చాడు విశ్వక్‌. కొత్త సినిమా రిలీజ్‌ అయ్యే సమయంలో ప్రసాద్‌ ఐమ్యాక్స్‌ వద్ద రివ్యూలు చేసే యువకుడితో ఈ ప్రాంక్ వీడియో చేశాడు. ‘విశ్వక్‌సేన్‌ తన కారులో ఫిలింనగర్‌‌ రోడ్డులో వెళుతుంటాడు, సరిగ్గా అదే సమయంలో ఆ యువకుడు రోడ్డుపై కారుకు అడ్డంగా పడుకుని హల్‌చల్‌ చేశాడు. విశ్వక్‌సేన్ కారులోంచి దిగి అసలేం జరిగిందని యువకుడిని అడుగుతాడు. అప్పుడు ఆ యువకుడు అల్లం అర్జున్‌ కుమార్ (అశోక వనంలో అర్జున కల్యాణం సినిమాలో హీరో విశ్వక్‌సేన్‌ పేరు)కు33 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కాలేదు సార్‌‌. అది నేను తట్టుకోలేకపోతున్నాను. పెట్రోల్‌ పోసుకుని సూసైడ్‌ చేసుకుంటానంటూ హడావుడి చేశాడు. ఇదంతా నిజంగానే జరుగుతోందా అన్నట్టు విశ్వక్‌ కూడా బిహేవ్ చేశాడు. 

దీంతో కాసేపు నడిరోడ్డుపై  వీరిద్దరి హంగామా నడిచింది. ట్రాఫిక్ ఆగిపోవడంతో అక్కడి జనాలు కూడా ఇబ్బంది పడ్డారు. ఈ వీడియోని సోషల్ మీడియా, యూట్యూబ్‌లలో ప్రమోట్ చేయగా ఇది చూసిన వాళ్లంతా సినిమా ప్రమోషన్స్‌ కోసం మరీ ఇంతగా దిగజారాలా? ప్రమోషన్స్ పేరుతో పబ్లిక్‌ ప్లేస్‌లో ప్రాంక్‌ వీడియోలు చేస్తూ  ఈ న్యూసెన్స్‌ ఏంటి అని విశ్వక్‌సేన్‌ (Vishwak Sen)నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!