కోయిలమ్మ జానకమ్మ(S.Janaki Amma) పుట్టిన రోజు
నైటింగేల్ ఆఫ్ సౌతిండియాగా ఎస్. జానకి ఎన్నో భాషల్లో ఎన్నో వేల పాటలు పాడారు. మధురమైన గీతాలతో మైమరపించిన కోయిల ఎస్. జానకి పుట్టిన రోజు నేడు. హ్యాపీ బర్త్‌డే జానకమ్మ.
పాటల తోటలో పూసిన పువ్వు ఎస్.జానకి. ఎన్నో భాషల్లో ఎన్నో వేల పాటలు పాడిన అరుదైన గాయని. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ, ఒరియా, సింహళ,తుళు, సౌరాష్ట్ర, జపనీస్, జర్మనీ, ఇంగ్లీషు భాషల్లో పాటలు పాడారు.
జానకమ్మ 1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా రేపల్లెలోని పాలపట్ల గ్రామంలో జన్మించింది. గాయనిగా కేరీర్ మొదలు పెట్టిన ఎస్. జానకి ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నారు. జానకమ్మ తండ్రి ఆయుర్వేద వైద్యుడు.ప్రముఖ సంగీత విద్వాంసుడు శ్రీ పైడిస్వామి దగ్గర సంగీతంలో జానకమ్మకు శిక్షణ ఇప్పించారు.
పగలే వెన్నెల, గున్న మామిడి కొమ్మ మీద, గోవులు తెల్లన, గోపయ్య నల్లనా, ఈ దుర్యోధన దుశ్శాసన, సిరిమల్లే పువ్వా..అంటూ వేల పాటలు పాడారు. చిన్నారుల వాయిస్‌తో పాడటం ఎస్. జానకికే సాధ్యమైంది. టీనేజ్ పిల్లల పాడే హస్కీ వాయిస్ జానకమ్మ సొంతం. చిన్నా, పెద్దా ఎలాంటి వయసు వారికైనా సరిపోయేలా పాడటం జానకమ్మ స్పెషాలిటీ.
1957లో ఆల్ ఇండియా రేడియో నిర్వహించిన జాతీయ స్థాయి సంగీత పోటీలో ఉత్తమ గాయనిగా, అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఎస్. జానకమ్మ మరిన్ని బర్త్‌డేలు చేసుకుంటూ, పాటలు పాడుతూ, ఆరోగ్యంగా ఉండాలని పింక్ విల్లా కోరుకుంటుంది.