Malavika Mohanan: టాలీవుడ్ హీరోపై మోజు ప‌డుతున్న‌.. మ‌ల‌యాళ బ్యూటీ మాళ‌విక మోహ‌న‌న్!

Updated on May 22, 2022 04:10 PM IST
విజయ్ దేవ‌ర‌కొండ‌, మాళ‌విక మోహ‌న‌న్ (Vijay Devarakonda, Malvika Mohanan)
విజయ్ దేవ‌ర‌కొండ‌, మాళ‌విక మోహ‌న‌న్ (Vijay Devarakonda, Malvika Mohanan)

మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ (Malavika Mohanan) తమిళ్‌లో రజినీకాంత్ 'పేట' సినిమాతో పాటు.. విజయ్ సరసన 'మాస్టర్', ధనుష్ సరసన 'మారన్'.. ఇలా స్టార్ హీరోలతో పెద్ద పెద్ద సినిమాలను చేస్తోంది. ఆ సినిమాలు తెలుగులో కూడా డబ్ అవ్వడంతో.. ఇక్క‌డి ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం అయింది మాళవిక. ఈ నేప‌థ్యంలో ఈ అందాల సుందరి టాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు బిగ్ ప్లాన్ వేసింది.

తాజాగా ట్విట్టర్‌లో తన అభిమానులతో ముచ్చటించిన‌ మాళవిక మోహనన్.. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ఈ సందర్భంగా  టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండపై (Vijay Devarakonda) తన మనసులో ఉన్న మాటను చెప్పేసింది.

ఓ నెటిజన్ ప్రశ్నిస్తూ  'మీరు సూప‌ర్ స్టార్ రజినీకాంత్, విజయ్ లాంటి స్టార్ హీరోలతో నటించారు, తర్వాత ఎవరితో నటించాలని అనుకుంటున్నారు' అని అడిగాడు. ఇందుకు మాళవిక ఊహించని విధంగా బదులిచ్చింది. 'విజయ్ దేవరకొండతో ఓ రొమాంటిక్, లవ్ స్టోరీలో నటించాలని ఉందని' తెలిపింది. ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో ఒక్కసారిగా నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు.

విజయ్ దేవరకొండతో కలిసి మాళవిక సినిమా చేయబోతుందా? అనే సందేహం వెలిబుచ్చుతున్నారు. కాగా, ఇప్పటికే విజయ్ ‘జన గణ మన’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఇంకా హీరోయిన్ కన్ఫమ్ కాలేదు. కాగా, గతంలోనూ పలువురు టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన‌ హీరోయిన్స్.. తమకు విజయ్ దేవరకొండతో నటించాలని ఉందని తెలిపారు. దీంతో మరోసారి విజయ్‌కి, అమ్మాయిల్లో బాగా ఫాలోయింగ్ ఉందని అర్ధమవుతోంది. మరి విజయ్ సినిమాలో మాళవికకు ఛాన్స్ ఎప్పుడు వస్తుందో మనం కూడా వేచి చూడాలి మరి. 

ఇక‌, మాళవిక (Malavika Mohanan).. ఇప్ప‌టికే తెలుగులో ఎంట్రీకి ప్లాన్‌ చేసుకుంటున్నట్టు సమాచారం. ప్రభాస్‌తో ఆమె జోడీ కట్టబోతున్న‌ట్లు తెలుస్తోంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ నటించే చిత్రంలో హీరోయిన్‌గా 'మాళవిక' పేరు వినిపిస్తోంది. ఇదే గ‌నుక‌ నిజమైతే.. ఈ అమ్మడి టాలీవుడ్‌ ఎంట్రీ గ్రాండ్‌గా ఉండబోతుందని చెప్పవ‌చ్చు. అదేవిధంగా ఆమె పెళ్లి గురించి  నెటిజన్ సంధించిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘త్వరలో ఉండొచ్చు’ అని చెప్పింది. కాగా, ఈ భామ‌ ప్రస్తుతం హిందీ చిత్రం ‘యుద్ర’లో నటిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ బ్యూటీ గతేడాది ద‌ళపతి విజయ్ నటించిన ‘మాస్టర్’ చిత్రంలో హీరోయిన్‌గా నటించి, తెలుగులో కూడా అభిమానులను సంపాదించుకుంది. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో, మాళవికకు బాగా డిమాండ్ పెరిగింది. అంతకు ముందు (Rajini kant) రజినీకాంత్ ‘పేట’ మూవీలోనూ మెరిసిందీ బ్యూటీ. ఇటీవలే విడుదలైన తమిళ డబ్డ్ మూవీ ‘మారన్’ చిత్రంలో.. హీరో ధ‌నుష్ స‌ర‌స‌న‌ నటించి మెప్పించింది మాళవిక. ఇలా వరుస చిత్రాల్లో విభిన్న పాత్రలలో నటిస్తున్న మాళవిక మోహనన్, తాజాగా టాలీవుడ్ ఎంట్రీపైనా హింట్ ఇచ్చింది.

మాళవిక ఎప్పుడూ తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా ముచ్చటిస్తూనే ఉంటుంది. వారిని ఖుషీ చేసేందుకు, అప్పుడప్పుడు లైవ్ సెషన్స్ ద్వారా ఇంటరాక్ట్ అవుతుంటుంది. సోషల్ మీడియాలో అదరగొట్టే ఫోజులతో ఫోటోలు కూడా పోస్ట్ చేస్తూ ఉంటుందీ బ్యూటీ. తాజాగా ట్వీటర్ లో #AskMalvika సెషన్‌ను నిర్వహించింది. ఇదే క్రమంలో అభిమానులు, నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చింది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!