"హాయి.. హాయి.. ఓ ఇషా" అంటున్న మేజ‌ర్ (Major)

Updated on May 22, 2022 01:04 PM IST
Major: అడివి శేష్‌ ఫస్ట్‌  పాన్ ఇండియా మూవీ మేజ‌ర్ సినిమా నుంచి ల‌వ్ సాంగ్ రిలీజ్ అయింది. హాయి.. హాయి. ఓ ఇషా పాట‌ను మేజ‌ర్ సినిమా నుంచి రిలీజ్ చేశారు. 
Major: అడివి శేష్‌ ఫస్ట్‌  పాన్ ఇండియా మూవీ మేజ‌ర్ సినిమా నుంచి ల‌వ్ సాంగ్ రిలీజ్ అయింది. హాయి.. హాయి. ఓ ఇషా పాట‌ను మేజ‌ర్ సినిమా నుంచి రిలీజ్ చేశారు. 

అడివి శేష్‌ నటిస్తున్న తొలి  పాన్ ఇండియా మూవీ 'మేజ‌ర్' (Major). ఈ సినిమా నుండి ఇటీవలే ఓ ప్రేమ గీతం విడుదల అయింది. 'హాయి.. హాయి.. ఓ ఇషా' అనే పాట‌ను నిర్మాతలు సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. మేజర్‌ సందీప్  ఉన్నికృష్ణన్‌  జీవితం ఆధారంగా పాన్ ఇండియా సినిమాగా 'మేజ‌ర్' తెర‌కెక్కింది. ఈ చిత్రంలో అడ‌వి శేష్ 'మేజ‌ర్ సందీప్  ఉన్నికృష్ణన్ ' రోల్‌లో న‌టిస్తున్నారు. తెలుగు, హిందీ భాష‌ల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 

'ఓ ఇషా' పాట‌ ప్రధానంగా సంవత్సరాలను హైలెట్ చేస్తూ రూపొందించబడింది. మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్‌కు సంబంధించిన కాలేజ్ లైఫ్.. ఆయన ప్రేమ‌, పెళ్లి లాంటి ముఖ్యమైన సంఘటనలను హైలెట్ చేస్తూ, సన్నివేశాలను షూట్ చేశారు. 1995లో 'మేజ‌ర్' ప్రేమ‌లో ప‌డ‌తాడనే క్లూతో పాట‌ను హైలెట్ చేశారు. సందీప్ 2001లో ఆర్మీలో చేరుతాడు. అలాగే 2003లో పెళ్లి చేసుకుంటాడు. ఆ విష‌యాల‌ను గుర్తు చేసుకుంటూ, మేజ‌ర్ భార్య త‌మ ఫోటోల వంక చూస్తూ, బాధ‌ప‌డే సంఘ‌ట‌న‌ను ఈ సాంగ్‌లో చూపించారు. 

అడివి శేష్‌, సాయి మంజ్రేకర్‌ (Sai Manjrekar) కు జోడిగా 'మేజ‌ర్' చిత్రంలో న‌టిస్తున్నారు. శశి కిరణ్‌ తిక్క ఈ చిత్రానికి దర్శకత్వం వ‌హిస్తున్నారు. మహేష్‌ బాబుకు చెందిన జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌తో కలిసి... సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా ఈ సినిమాను భారీగా నిర్మించింది. ఈ సినిమాకు వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీని అందించారు.  తెలుగు, హిందీ భాషల్లో 'మేజ‌ర్' సినిమాను ఏకకాలంలో చిత్రీకరించారు. తెలుగు, హిందీ, మలయాళం భాషలలో, ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూన్‌ 3 న విడుదల కానుంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!