ఫ్యామిలీతో దుబాయ్‌కు సూపర్‌‌స్టార్‌‌ మహేష్‌బాబు (MaheshBabu)

Updated on Apr 24, 2022 07:56 PM IST
హైదరాబాద్‌ ఎయిర్‌‌పోర్ట్‌లో మహేష్‌బాబు (MaheshBabu)
హైదరాబాద్‌ ఎయిర్‌‌పోర్ట్‌లో మహేష్‌బాబు (MaheshBabu)

వర్క్​కు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంతే ప్రాధాన్యత ఫ్యామిలీకి ఇవ్వడం అనేది చాలా మంది పద్దతి. అటువంటి పద్దతిని ప్రస్తుత హీరోలు అందరూ దాదాపుగా ఫాలో అవుతున్నారు. ఈ వరుసలో ముందుంటారు సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు. ఏడాదికి కనీసం రెండుసార్లు కుటుంబంలో కలిసి ఏదో ఒక దేశానికి హాలీడే ట్రిప్కు వెళుతుంటారు. సినిమా షూటింగ్ సమయంలో, రిలీజ్‌ అయ్యే సమయంలో ఉండే ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం అలాగే భార్యా పిల్లలతో ప్రశాంతంగా గడిపేందుకు విదేశాలకు వెళుతుంటానని సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) చాలాసార్లు చెప్పారు కూడా.

 ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ పూర్తికావడం, మే 12న రిలీజ్‌కు రెడీ కావడంతో మహేష్ కుటుంబంతో కలిసి దుబాయ్‌కి వెళ్లారు. హైదరాబాద్‌ ఎయిర్‌‌పోర్ట్​కు వెళ్లిన మహేష్‌బాబు ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  మే3వ తేదీన దుబాయ్‌ నుంచి తిరిగి రానున్నట్టు తెలుస్తోంది. ఇక, మహేష్‌బాబు తర్వాతి సినిమా రాజమౌళితో చేయబోతున్నారు. ‘సర్కారు వారి పాట’ సినిమా రిలీజ్ అయిన తరువాత తన తదుపరి చిత్ర షూటింగ్‌ను స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం.

ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సక్పెస్‌ను ఎంజాయ్‌ చేయడానికి దర్శక ధీరుడు రాజమౌళి కూడా దుబాయ్‌ వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ వాళ్లిద్దరూ కలుస్తారని తెలుస్తోంది. ఈ సందర్భంగా సినిమా కథ, తదితర అంశాలపై చర్చించనున్నారని సమాచారం. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కనున్న మహేష్‌ – రాజమౌళి సినిమా షూటింగ్‌ డిసెంబర్‌‌ నుంచి మొదలుకాబోతోందని సినీవర్గాల ద్వారా తెలుస్తోంది.

కాగా, ‘సర్కారు వారి పాట’ సినిమా టైటిల్‌ సాంగ్‌ను చిత్ర యూనిట్‌ శనివారం రిలీజ్ చేసింది. ‘సర్కారు వారి పాట.. వెపన్స్‌ లేని వేట’ అంటూ సాగే టైటిల్‌ సాంగ్‌ మహేష్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. పాటను సింగర్‌‌ హారికా నారాయణ్‌ పాడగా.. తమన్‌ మ్యూజిక్‌ అందించారు. మే 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో మహేష్‌ స్టైలిష్‌ లుక్‌తో కనిపిస్తున్నారు. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటించారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!