మరో గంటలో మహేష్ ( MaheshBabu) ‘సర్కారు వారి పాట’ ట్రైలర్

Updated on May 02, 2022 03:14 PM IST
‘సర్కారు వారి పాట’ సినిమాలో మహేష్ ( MaheshBabu)
‘సర్కారు వారి పాట’ సినిమాలో మహేష్ ( MaheshBabu)

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సర్కారు వారి పాట’. మామూలుగానే ప్రిన్స్‌ సినిమా, దానికి సంబంధించిన అప్‌డేట్స్‌ వస్తున్నాయంటే ఆయన అభిమానుల కోలాహలం మామూలుగా ఉండదు. అటువంటిది సూపర్‌‌ హిట్‌ సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత వస్తున్న సినిమా అంటే ప్రేక్షకుల్లో ఏ రకమైన అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ ఈ సినిమాలో మహేష్ లుక్, స్టైల్‌ మెస్మరైజింగ్‌గా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్‌ అయిన మహేష్‌ ( MaheshBabu) లుక్స్‌ సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచేశాయి.

అవి చాలవన్నట్టు ‘సర్కారు వారి పాట’ నుంచి ఇటీవల రిలీజైన పాటలు సూపర్‌‌హిట్ అయ్యాయి. నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇక ఇటీవల రిలీజైన టైటిల్‌ సాంగ్‌, దాని లిరిక్స్‌, మ్యూజిక్‌ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి. థమన్‌ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. ఇక మరో గంటలో ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. దాని కోసం మహేష్‌బాబు అభిమానులతోపాటు సినీ ప్రేమికులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనెల 12న మహేష్‌ ‘సర్కారు వారి పాట’ సినిమా గ్రాండ్​గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో సోమవారం 4 గంటలకు సినిమా ట్రైలర్ రిలీజ్‌ చేయనున్నట్టు చిత్ర యూనిట్‌ ప్రకటించింది.

పరశురామ్ దర్శకత్వంలో చేసిన సర్కారు వారి పాట సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో కీర్తి సురేశ్ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రం తర్వాత మహేశ్ (MaheshBabu).. త్రివిక్రమ్ డైరక్షన్‌లో ఓ సినిమా చేయడానికి పచ్చజెండా ఊపారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్​పైకి వెళ్లనుంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!