అమ్మాయిల్ని.. అప్పిచ్చే వాళ్లను రఫ్‌గా హ్యాండిల్‌ చేయకూడదు అంటున్న మహేష్‌ (MaheshBabu)

Updated on May 02, 2022 04:50 PM IST
సర్కారు వారి పాట సినిమాలో మహేష్‌బాబు (MaheshBabu)
సర్కారు వారి పాట సినిమాలో మహేష్‌బాబు (MaheshBabu)

U can steal my Love.. నా ప్రేమను దొంగిలించగలవు

U can steal my Friendship.. నా స్నేహాన్నీ దొంగిలించగలవ్‌..

But u cant steal my Money  

అమ్మాయిల్ని, అప్పిచ్చే వాళ్లనీ పాంపర్ చేయాలిరా.. రఫ్‌గా హ్యాండిల్‌ చేయకూడదు... నెక్స్ట్‌..

 ఇది ‘సర్కారు వారి పాట’ సినిమా ట్రైలర్‌‌లో మహేష్‌బాబు చెప్పిన ఒక డైలాగ్‌.

సూపర్‌‌స్టార్‌‌ మహేష్‌బాబు హీరోగా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ సినిమా ట్రైలర్‌‌ రిలీజైంది. అనుకున్నట్టుగానే మహేష్‌ డైలాగ్స్‌, మేనరిజం ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించేలా ఉన్నాయి. డైలాగ్స్, వాటి టైమింగ్‌తోపాటు మహేష్‌ లుక్స్‌ కూడా ఆకట్టుకుంటున్నాయి. విలన్‌గా సముత్రిరఖని పవర్‌‌ఫుల్‌ క్యారెక్టర్‌‌ పోషించినట్టు తెలుస్తోంది. మహేష్‌, వెన్నెల కిషోర్‌‌ మధ్య జరిగే కామెడీ నవ్వులు పూయిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ అలరిస్తోంది. మొత్తానికి మహేష్‌ సినిమా ట్రైలర్‌‌ అందరికీ నచ్చేలా.. సినిమాపై అంచనాలను మరింత పెంచేలా ఉందని చెప్పచ్చు.

తాజాగా రిలీజైన ట్రైలర్‌‌లో మహేష్‌ డైలాగ్స్‌ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. ముఖ్యంగా ట్రైలర్‌‌ స్టార్టింగ్‌లో మహేష్‌ చెప్పిన ‘ నా ప్రేమను దొంగిలించగలరు.. నా స్నేహాన్ని దొంగిలించగలరు.. కానీ నా డబ్బును ఎవ్వరూ దొంగిలించలేరు’ డైలాగ్స్‌ సినిమాలో తన క్యారెక్టర్‌‌ను తెలియజేస్తున్నాయి.

ఇక, వెన్నెల కిషోర్, మహేష్‌బాబు మధ్య జరిగే సంభాషణల్లో.. ‘పెళ్లికి అప్పుడే ఏం తొందర ఇంకా చిన్న పిల్లాడైతేను’ అని కిషోర్‌‌ అనడంతోటే.. ‘అందరూ అలాగే అనుకుంటున్నారయ్యా.. మెయింటెయిన్‌ చేయలేక దూల తీరిపోతోంది’ అని మహేష్‌ చెప్పే ఆన్సర్‌‌ ఆకట్టుకుంటోంది.

వరుస హిట్లతో జోరు మీదున్న మహేష్‌.. తన విజయయాత్రను కొనసాగించాలనే సంకల్పంతో ఉన్నాడు. అదే ఊపుతో సర్కారు వారి పాట సినిమాను పూర్తి చేశాడు. కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమా నుంచి రిలీజైన పాటలు ఇప్పటికే సోషల్‌ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇటీవల రిలీజైన టైటిల్‌ సాంగ్‌ కూడా మాస్‌ ప్రేక్షకులతోపాటు క్లాస్ ప్రేక్షకులను కూడా అలరిస్తోంది.

ఈ మధ్య కాలంలో ఎస్‌ఎస్‌ థమన్ మ్యూజిక్ అందించిన దాదాపుగా అన్ని సినిమాలు హిట్‌ టాక్‌ సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా ఆయా సినిమాల్లో థమన్‌ కొట్టిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమాపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలను అందుకునే విధంగానే థమన్‌ పాటలు కూడా ఉన్నాయ. ముందుగా రిలీజ్ చేసిన కళావతి పాట మ్యూజిక్ లవర్స్‌కు తెగ నచ్చేసింది.

పరశురామ్ దర్శకత్వంలో చేసిన ‘సర్కారు వారి పాట’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కీర్తి సురేశ్ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రం తర్వాత మహేశ్ (MaheshBabu).. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయడానికి పచ్చజెండా ఊపారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్​పైకి వెళ్లనుంది. ఈ సినిమాకు ముందు మహేష్‌ చేసిన సరిలేరు నీకెవ్వరు, మహర్షి, భరత్‌ అనే నేను సూపర్ హిట్‌ అయ్యాయి.

 
 
అందరూ నీలాగే అనుకుంటున్నారయ్యా.. దీనమ్మ మెయింటెయిన్‌ చెయ్యలేక .. తీరిపోతోంది
సర్కారు వారి పాట సినిమాలో మహేష్‌ బాబు
 
Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!