వరుస సర్‌‌ప్రైజ్‌లు ప్లాన్ చేస్తున్న మహేష్‌ (MaheshBabu) ‘సర్కారు వారి పాట’ టీమ్

Updated on May 01, 2022 09:15 PM IST
12న ప్రేక్షకుల ముందుకు మహేష్‌బాబు(MaheshBabu)  ‘సర్కారు వారి పాట’
12న ప్రేక్షకుల ముందుకు మహేష్‌బాబు(MaheshBabu) ‘సర్కారు వారి పాట’

సూపర్‌‌స్టార్‌‌ మహేష్‌బాబు (MaheshBabu)  నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే చిత్ర యూనిట్‌ రిలీజ్ చేసిన ఫస్ట్‌ లుక్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమాపై ఉన్న అంచనాలు వీటితో మరింతగా పెరిగాయి. ఇక ఈ సినిమాలో మహేష్‌ స్టైలిష్‌ లుక్, మేనరిజం సినిమాపై ఉన్న భారీ అంచనాలను వేరే లెవెల్‌కు తీసుకెళుతున్నాయి. సినిమా అప్‌డేట్స్​ను ఒక్కొక్కటిగా రిలీజ్‌ చేస్తోంది చిత్ర యూనిట్‌.

ఈ క్రమంలోనే మరికొన్ని గంటల్లో ‘సర్కారు వారి పాట’ సినిమా ట్రైలర్‌‌ను రిలీజ్‌ చేయనున్నారు. సినిమా ట్రైలర్‌‌ కోసం మహేష్‌బాబు అభిమానులతోపాటు సినిమా ప్రేమికులు కూడా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ట్రైలర్‌‌ రిలీజ్ అయిన తరువాత సినిమా అభిమానులకు మరో ట్రీట్‌ ఇవ్వబోతున్నట్టు మ్యూజిక్‌ డైరెక్టర్‌‌ ఎస్‌ఎస్‌ థమన్ ప్రకటించాడు. ట్రైలర్‌‌ రిలీజ్ అయిన తరువాత ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి మరో రెండు పాటలను రిలీజ్ చేస్తానని అప్‌డేట్‌ ఇచ్చాడు.

ఈ రెండు పాటల్లో ఒకటి పక్కా మాస్‌ సాంగ్‌ కాగా.. మరొకటి మెలోడీ అని చెప్పాడు థమన్. మొత్తానికి ఈ సినిమా థియేటర్లలోకి రిలీజ్ అయ్యేలోపుగానే మహేష్‌ ఫ్యాన్స్​కు గిఫ్ట్​ల మీద గిఫ్ట్​లు, సర్‌‌ప్రైజ్​లు ఇవ్వాలని చిత్ర యూనిట్ ఫిక్స్ అయినట్టు అనిపిస్తోంది.

‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ పూర్తికావడం, మే 12న రిలీజ్‌కు రెడీ కావడంతో మహేష్ (MaheshBabu)   కుటుంబంతో కలిసి దుబాయ్‌కి వెళ్లారు. హైదరాబాద్‌ ఎయిర్‌‌పోర్ట్​కు వెళ్లిన మహేష్‌బాబు ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  మే3వ తేదీన దుబాయ్‌ నుంచి తిరిగి రానున్నట్టు తెలుస్తోంది. ఇక, మహేష్‌బాబు తర్వాతి సినిమా రాజమౌళితో చేయబోతున్నారు. ‘సర్కారు వారి పాట’ సినిమా రిలీజ్ అయిన తరువాత తన తదుపరి చిత్ర షూటింగ్‌ను స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!