సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata): ఆ ఏరియాల్లో కలెక్షన్స్ తగ్గాయి.. ఎందుకో తెలుసా?
సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) కలెక్షన్ల పరంగా భారీ వసూళ్లను రాబడుతోంది. ప్రిన్స్ మహేష్ బాబు, దర్శకుడు పరుశురామ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా నైజాంతో పాటు, ఆంధ్రాలో కూడా కాస్త తక్కువ కలెక్షన్లతోనే ఆడుతోంది. ఈ చిత్రానికి బ్రేక్ ఈవెన్ రావాలంటే, ఇంకా ఎంత మొత్తాన్ని వసూలు చేయాలో మనం కూడా తెలుసుకుందాం.
మహేష్ బాబు (Mahesh Babu), కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా మే 12 న రిలీజ్ అయింది. దర్శకుడు పరుశురామ్ మహేష్ బాబును చాలా వైవిధ్యంగా చూపించారు. ఆయన మేనరిజమ్స్ అన్నీ దాదాపు పోకిరి సినిమా స్టైల్లోనే ఉంటాయి. అయితే పోకిరితో పోలిస్తే, ఈ చిత్రంలో మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంటుంది. సర్కారు వారి పాట విడుదలైన మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు కొల్లగొట్టింది.
క్షీణించిన వసూళ్లు..
ఏదేమైనా, తెలుగు సినిమా అయినప్పటికీ కూడా, "సర్కారు వారి పాట" తెలుగు రాష్ట్రాల్లో మాత్రం లాభాలు తెచ్చిపెట్టలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఇంకా 40 శాతానికి పైగా కలెక్షన్స్ నమోదు అయితేనే.. చిత్రం హిట్ టాక్‌ను తెచ్చుకుంటుంది. లేదా యావరేజీగా మిగిలిపోతుంది. తాజా వార్తల ప్రకారం, నైజాంలో "సర్కారు వారి పాట" ఐదో రోజు వసూళ్లు భారీగా క్షీణించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఆంధ్రాలో వసూళ్లు కాస్త ఫర్వాలేదనిపించే స్థాయిలో ఉన్నాయి.
నాలుగు రోజుల కలెక్షన్ చూస్తే...
"సర్కారు వారి పాట" ఏపీ, నైజాం ఏరియాలలో 75.58 కోట్ల షేర్ రాబట్టింది.
ఇతర రాష్ట్రాల్లో మాత్రం 7.6 కోట్లు వసూళ్లు చేయగా, ఓవర్సీస్‌లో 11.9 కోట్ల షేర్‌తో, ప్రపంచవ్యాప్తంగా 95.08 కోట్ల షేర్ రాబట్టింది.
"సర్కారు వారి పాట" మామూలు రోజులతో పోలిస్తే, వీకెండ్స్‌లో భారీ వసూళ్ళను రాబట్టడం విశేషం. ఇక ఈ సినిమా మొదటి నాలుగు రోజుల వసూళ్లను ఓ సారి పరిశీలిస్తే, తొలి రోజున రూ. 19.80 కోట్లు, రెండో రోజున రూ.8.60 కోట్లు, మూడో రోజున రూ.9.25 కోట్లు, నాలుగో రోజున రూ.8.45 కోట్లు నమోదు చేసింది.
అయితే, ఐదో రోజున వర్కింగ్ డే కావడంతో తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ళు, దాదాపు 40 శాతం వరకూ పెరగాల్సి ఉంది. ప్రస్తుతం, మరో 25 కోట్ల రూపాయల బిజినెస్ చేస్తేనే సర్కారు వారి పాట సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా లాభాలు సాధించే అవకాశం ఉంది.