మనసుకు నచ్చిన వ్యక్తి కనబడలేదనే ఇంకా పెళ్లి చేసుకోలేదంటున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)

Updated on Aug 21, 2022 08:43 PM IST
లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) నాగార్జున పక్కన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో నటించారు
లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) నాగార్జున పక్కన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో నటించారు

లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi).. అందాల బొమ్మ కాదు కాదు.. అందాల రాక్షసి. ఇదే మాట అంటుంటారు ఆమె అభిమానులు. అందాల రాక్షసి సినిమాతో  తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి. ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమే అయినా ఇంకా స్టార్ హీరోయిన్ లిస్టులోకి చేరలేదు.

దానికి కారణాలు చాలానే ఉన్నాయి. సీనియర్ హీరో సినిమాలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఇందుకు ప్రధాన కారణం. నిజానికి హీరో నాగార్జున, లావణ్య త్రిపాఠి మధ్య వయసు చాలా తేడా ఉంది. కానీ, సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో ఆయనకి భార్యగా నటించింది. అక్కడే ఆమెకు సగం మైనస్ అయ్యింది. ఈ సినిమా వరకు అమ్మడికి అవకాశాలు అంతో ఇంతో వచ్చినా.. నాగార్జున పక్కన నటించాక సినిమా అవకాశాలు పూర్తిగా దూరమయ్యాయి. దీంతో వచ్చిన సినిమాలలో నచ్చిన సినిమాలు చేసి మెప్పించడానికి ట్రై చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. సినిమాల పరంగా ఎలా ఉన్నా లావణ్య త్రిపాఠి వ్యక్తిగత జీవితం ఎప్పుడూ మీడియాలో ట్రెండింగ్‌లోనే ఉంటుంది. ఇటీవలే హ్యాపీ బర్త్‌డే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు లావణ్య త్రిపాఠి

లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) నాగార్జున పక్కన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో నటించారు

రొమాన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా..

మెగా హీరో వరుణ్ తేజ్‌తో రెండు సినిమాలు చేసింది లావణ్య. అంతే, ఈ సినిమాల్లో వాళ్లిద్దరి రొమాన్స్‌కు సినీ జనాలు ఫిదా అయ్యారు. ఇద్దరి కెమిస్ట్రీ బాగుండడంతో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అలాంటి వార్తలను నిజం అనిపించేలా .. వీళ్లిద్దరూ ప్రైవేట్ పార్టీలు చేసుకుంటూ క్లోజ్ గా మూవ్ అవుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో లీకై వైరల్ గా మారాయి. రీసెంట్ గా లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ఓ కామన్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్టీలో ఎంజాయ్ చేసిన పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి. దీంతో వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు మళ్లీ వైరల్ అయ్యాయి.

ఈ క్రమంలో ఆ వార్తలపై లావణ్య త్రిపాఠి స్పందించారు. ‘మేమిద్దరం కేవలం ఫ్రెండ్సే. మా మధ్య ప్రేమ దోమ లాంటివి లేవు’ అని క్లారిటీ ఇచ్చింది. తాను ఇప్పటివరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదో కూడా క్లారిటీ ఇచ్చింది లావణ్య. ‘తన మనసుకు నచ్చిన వ్యక్తి ఇప్పటివరకు తనకు కనపడలేదని ఆ కారణంతోనే ఇంకా పెళ్లి చేసుకోలేదని తన మనసుకు నచ్చిన వ్యక్తి కనిపించిన క్షణం మీకే చెప్పి పెళ్లి చేసుకుంటానని’ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi).

Read More : కెరీర్‌‌ పరంగా ఆనందంగానే ఉన్నా.. యాక్షన్ సినిమాలు చేయడం ఇష్టం: లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!