‘ఏదో మైకంలో తేలిపోతున్నా’ అంటూ ‘హ్యాపీబర్త్‌డే’ పార్టీ సాంగ్‌లో రెచ్చిపోయిన లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)

Updated on Jul 05, 2022 11:07 AM IST
లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)
లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)

‘అందాల రాక్షసి’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi). ఆ తర్వాత మనం, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా వంటి హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు లావణ్య. తెలుగుతోపాటు హిందీ, తమిళంలోని పలు సినిమాల్లో నటించి ఈమె మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా లావణ్యా త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘హ్యాపీ బర్త్‌ డే’.

హ్యాపీ బర్త్‌ డే’ సినిమాలో నరేష్ ఆగస్త్య, సత్య, కిషోర్, గెటప్‌ శీను ఇతర కీలక పాత్రల్లో నటించారు. రితేష్‌ రానా దర్శకత్వం వహించిన ఈ సినిమాను క్లాప్ ఎంటర్‌‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్లపై నవీన్‌ యెర్నేని, రవిశంకర్ తదితరులు నిర్మించారు. జూలై 8వ తేదీన ‘హ్యాపీ బర్త్‌ డే’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో జోరు పెంచింది చిత్ర యూనిట్.

ట్రైలర్, పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయ్..

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్ర పోషించిన ‘హ్యాపీ బర్త్‌ డే’ సినిమాకు సంబంధించి రిలీజ్‌ చేసిన పోస్టర్, ట్రైలర్‌‌ ప్రేక్షకులను మెప్పించాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో సింగిల్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.  ‘హ్యాపీ బర్త్‌ డే’ సినిమా నుంచి పార్టీ సాంగ్‌ రిలీజ్ అయ్యింది.

ఫుల్‌ జోష్‌గా ఉన్న ఈ పాటను ఒక పబ్‌లో తెరకెక్కించారు డైరెక్టర్. దామిని భట్ల పాడిన ఈ పాటకు కాలభైరవ లిరిక్స్ రాశారు. కిట్టూ విస్సాప్రగడ సాహిత్యం అందించిన ఈ పాటలో లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) వేసిన స్టెప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

Read More : ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ (Tollywood) సెలబ్రిటీలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!