స్లిమ్‌గా మారిన లేడీ విలన్‌ వరలక్ష్మీ శరత్‌ కుమార్ (Varalaxmi Sarathkumar).. 4 నెలల కష్టం అంటూ ఫోటోలు

Updated on Aug 23, 2022 09:07 PM IST
రవితేజ క్రాక్ సినిమాలో విలన్‌గా మెప్పించిన వరలక్ష్మీ శరత్‌ కుమార్ (Varalaxmi Sarathkumar) ప్రస్తుతం స్లిమ్‌గా మారారు.
రవితేజ క్రాక్ సినిమాలో విలన్‌గా మెప్పించిన వరలక్ష్మీ శరత్‌ కుమార్ (Varalaxmi Sarathkumar) ప్రస్తుతం స్లిమ్‌గా మారారు.

తెలుగు, త‌మిళ ప్రేక్షకుల‌కు పెద్దగా ప‌రిచ‌యం అక్కర్లేని పేరు వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ (Varalaxmi Sarathkumar). హీరోయిన్‌గా ఓ మెరుపు మెరిసిన‌ ఈ భామ విల‌న్‌గా కూడా న‌టించి సిల్వర్ స్క్రీన్‌పై త‌న‌ టాలెంట్ చూపించారు. గ‌తేడాది ర‌వితేజ న‌టించిన క్రాక్ సినిమాలో జ‌య‌మ్మగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో న‌టించి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ రాబట్టారు వరలక్ష్మి. మ‌రోవైపు నాంది సినిమాతోపాటు రీసెంట్‌గా వ‌చ్చిన ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌లో లాయర్‌‌గా మెరిశారు.

చూడ‌టానికి బొద్దుగా ఉన్న ఈ భామ అంద‌రికీ షాకిస్తూ కొత్త లుక్‌లోకి మారిపోయారు. కొత్త ట్రాన్స్ ఫర్మేష‌న్ లుక్ స్టిల్స్‌ను వ‌ర‌ల‌క్ష్మి నెట్టింట షేర్ చేశారు. ఆమె షేర్‌‌ చేసిన ఫోటోలు ప్రస్తుతం ట్రెండింగ్ అవుతున్నాయి. పొట్టి డ్రెస్‌లో స్లిమ్‌గా త‌ళుక్కున మెరుస్తూ కెమెరాకు ఫోజులిచ్చారు వరలక్ష్మి. కేవ‌లం 4 నెల‌ల్లోనే అద‌న‌పు బ‌రువును త‌గ్గించుకొని ఇలా కొత్త లుక్‌లోకి మారారు.

రవితేజ క్రాక్ సినిమాలో విలన్‌గా మెప్పించిన వరలక్ష్మీ శరత్‌ కుమార్ (Varalaxmi Sarathkumar) ప్రస్తుతం స్లిమ్‌గా మారారు.

మీకు మీరే పోటీ..

ఫిట్ అండ్ స్లిమ్ లుక్‌లో దిగిన స్టిల్స్ షేర్ చేస్తూ..’క‌ష్టం నిజం..స‌వాలు నిజం..కానీ మీరే ల‌క్ష్యాన్ని చేరుకోవాల‌నుకుంటున్నారో.. మిమ్మల్ని ఏదీ ఆప‌లేదు.. మీరు ఎవరో.. మీరెలా ఉండాలో ఎవరూ మీకు చెప్పలేరు. నిన్ను నువ్వు చాలెంజ్ చేసుకో.. మిమ్మల్ని మీరు పోటీగా చేసుకుంటే.. మీరు సాధించిన దాంతో ఆశ్చర్యపోవ‌డం ఖాయం.

నేను చూపించాల‌నుకున్న స్లిమ్ లుక్ వెనుక నాలుగు నెల‌ల కష్టం ఉంది. మీకు ఏది సంతోష‌మ‌నిపిస్తే అది చేయండి.. ఇత‌రులకు సంతోషాన్ని క‌లిగించే ప‌నులు చేయ‌కండి. ఎందుకంటే మీరేది చేయాలో.. ఏం చేయ‌కూడ‌దో ఎవ‌రూ చెప్పరు. మీ న‌మ్మకం, విశ్వాసమే.. మీ ఆయుధం.. మిమ్మల్ని మీరు న‌మ్మండి..’ అంటూ స్పూర్తినిచ్చే సందేశాన్ని పోస్ట్ చేశారు వరలక్ష్మీ శరత్‌ కుమార్. ప్రస్తుతం నందమూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న ఎన్‌బీకే 107లో కీలక పాత్రలో నటిస్తున్నారు వ‌ర‌ల‌క్ష్మి (Varalaxmi Sarathkumar).

Read More : Ramarao On Duty Review : మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) జనాలను మెప్పించాడా ? లేదా ?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!