'స‌లాం రాఖీభాయ్'(Yash)అంటోన్న నార్త్ సినిమా

Updated on Apr 30, 2022 06:19 PM IST
నార్త్‌లో సౌత్ ఇండియా సినిమాల హ‌వా జోరుగా కొన‌సాగుతుంది. కేజీఎఫ్2 నార్త్ సినిమా రికార్డుల‌న్నింటినీ బ్రేక్ చేసింది. య‌శ్(Yash) సినిమా రూ.350 కోట్లు హిందీలో వ‌సూళ్లు చేసిన సినిమాగా చ‌రిత్ర‌నే సృష్టించింది. 

బాహుబ‌లి, కేజీఎఫ్1, పుష్ఫ‌, ఆర్.ఆర్.ఆర్. సినిమాలు హిందీలో క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించాయి. కానీ య‌శ్(Yash) న‌టించిన‌ కేజీఎఫ్2 మాత్రం క‌లెక్ష‌న్ల సునామీని సృష్టించింది. హిందీలో రూ.350 కోట్ల‌ను కొల్ల‌గొట్టింది. ఇంత పెద్ద మొత్తంలోవ‌సూళ్లు సాధించిన హిందీ వ‌ర్షెన్ సినిమాగా కేజీఎఫ్2 నిలిచింది. 

ద‌క్షిణాది హీరోలో విజ‌య్, అజిత్, సూర్య‌, ప‌వ‌న్‌కళ్యాణ్ సినిమాలు హిందీలో డ‌బ్ అయ్యాయి. ఆ సినిమాలు హిట్ సాధించాయి. ఆ త‌ర్వాత ప్ర‌భాస్, అల్లు అర్జున్ సినిమాలు హిందీలో హిట్‌తో పాటు రికార్డులు బ్రేక్ చేశాయి. ఆర్.ఆర్.ఆర్ సినిమా కూడా రూ.300 కోట్లు వసూళ్లు రాబ‌ట్టింది. కేజీఎఫ్2 మాత్రం కాసుల వ‌ర‌ద‌లా దూసుకెళుతుంది. 

KGF Chater2

హోంబ‌లే ఫిలిమ్స్, విజ‌య్ కిర‌గాంధూర్ క‌లిసి కేజీఎఫ్‌2 సినిమా నిర్మించారు. త‌మిళ్ న్యూ ఇయ‌ర్ రోజు అంటే ఏప్రిల్ 14 సినిమా రిలీజ్ చేశారు. 10,000 ధియేట‌ర్ల‌లో ప్ర‌పంచ వ్యాప్తంగా కేజీఎఫ్2ను రిలీజ్ చేశారు. క‌న్న‌డ‌, హిందీ, త‌మిళ్, తెలుగు, మ‌ళ‌యాళంలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. సినిమా విడుద‌లైన నాలుగు రోజుల్లోనే రూ.546 కోట్లు వ‌చ్చేశాయి. ఇక రెండో వారంలో వేయి కోట్ల రూపాయ‌ల‌ను సొంతం చేసుకుంది కేజీఎఫ్‌2.

Yash Boss

ఉత్త‌రాదిలో కేజీఎఫ్‌2 రూ.350 కోట్ల వ‌సూళ్లు చేసిందంటే మామూలు విష‌యం కాదు.  హిందీ సినిమాల చ‌రిత్ర‌లోనే ఇంత పెద్ద మొత్తంలో ఏ సినిమా వ‌సూళ్లు చేయ‌లేద‌ట‌. ప్ర‌తీ రోజు క‌లెక్ష‌న్ల సునామీ పెరుగుతూనే ఉంది కానీ... రాఖీభాయ్‌కి అడ్డు వెళ్లే ద‌మ్ము ఉన్న సినిమా ఇంకా రాద‌ని సినీ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. య‌శ్(Yash)అభిమానుల వ‌ల్లే ఇదంత సాధ‌మైంద‌ని అంటున్నారు.  

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!