NTR31: ప్రశాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో.. ఎన్టీఆర్ హై ఓల్టేజ్‌తో పాన్ ఇండియా సినిమా

Updated on May 22, 2022 05:53 PM IST
NTR31: ఎన్టీఆర్ 31 సినిమా ఫ‌స్ట్ లుక్‌ను ప్ర‌శాంత్ నీల్ రివీల్ చేశారు.
NTR31: ఎన్టీఆర్ 31 సినిమా ఫ‌స్ట్ లుక్‌ను ప్ర‌శాంత్ నీల్ రివీల్ చేశారు.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బర్త్‌డే రోజు, ద‌ర్శ‌కుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel)  ఓ తాజా అప్డేట్‌తో ఆశ్చర్యపరిచారు.  ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో, ఎన్టీఆర్ 31 సినిమా తెరకెక్కనుందన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను ఇటీవలే ప్ర‌శాంత్ నీల్ రివీల్ చేశారు. మంచి మాస్ లుక్‌తో పాటు, సీరియ‌స్ యాక్ష‌న్ సీన్‌లో ఎన్టీఆర్ మనకు ఇందులో కనిపిస్తారు. 

ప్ర‌శాంత్ నీల్ తన యాక్ష‌న్ సినిమాల ప‌వ‌ర్ ఏంటో కేజీఎఫ్‌తో నిరూపించాడు. ప్రస్తుతం ప్ర‌భాస్ హీరోగా తెరకెక్కుతున్న 'స‌లార్' సినిమా షూటింగ్‌లో ఆయన బిజీగా ఉన్నారు. అయినా ఎన్టీఆర్ కోసం బ‌ర్త్ డే గిప్ట్ ఇచ్చారు. ఎన్టీఆర్ 31 సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. 'ఈ ఫస్ట్ లుక్ మామూలుగా లేదు.. అదిరిపోయింది' అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. 

ఎన్టీఆర్ ఉగ్ర‌రూపంలో ఉన్న ఈ లుక్,  ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అలాగే  ప్ర‌శాంత్ నీల్ వాడిన కొటేషన్స్ కూడా సినిమా రేంజ్ పెంచేలా ఉన్నాయి. "ర‌క్తంతో త‌డిచిన నేల‌ను గుర్తుపెట్టుకోండి.. అంతేగానీ అత‌ని నేల‌ను, అత‌ని పాల‌న‌ను. అత‌ని నెత్తురును కాదు " అంటూ ప్ర‌శాంత్ నీల్ ప‌వ‌ర్‌పుల్ డైలాగులు పేల్చారు. అలాగే ఎన్టీఆర్‌తో చెప్పించ‌బోయే డైలాగుల‌ను కూడా రివీల్ చేశారు. ఎన్టీఆర్ 31 సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ క‌లిసి నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 2023 లో ఈ సినిమా షూటింగ్ మొద‌లు కానుంది. 
 

 


 

NTR31: ఎన్టీఆర్ 31 సినిమా ఫ‌స్ట్ లుక్‌ను ప్ర‌శాంత్ నీల్ రివీల్ చేశారు.

ఆర్.ఆర్.ఆర్ సినిమాలో కొమురం భీముడి పాత్రలో ఎన్టీఆర్ న‌ట‌న చూశాక‌... అటువంటి ప‌వ‌ర్ ఫుల్ రోల్‌లోనే తనను చూపించాలని తీర్మానించుకున్నారు ప్ర‌శాంత్ నీల్.  అందుకే ఓ ఉగ్ర‌రూపంలో తార‌క్ లుక్‌ని తీర్చిదిద్దారు. దీంతో  అభిమానుల్లో ఆస‌క్తి పెరిగింది. మాస్ యాక్ష‌న్ ఎంటర్‌టైనర్‌గా ఎన్టీఆర్ 31 ఉంటుంద‌ని నిర్మాతలు అంటున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!