KGF Chapter 2 vs RRR : ఈ బాక్సాఫీస్ పోటీలో గెలిచిందెవరో తెలుసా?

Updated on Apr 19, 2022 11:35 AM IST
ద‌క్షిణాది  సినిమాలు హాలీవుడ్ సినిమాల రేంజ్‌కు చేరుకున్నాయి. సినిమా స్టైల్స్, ఎఫెక్ట్స్, ఇలా టెక్సాల‌జీలోనే కాదు..కాసుల క‌లెక్ష‌న్‌లోనూ ఏ మాత్రం త‌గ్గ‌డంలేదు. తొలి వారంలోనే ఐదు వంద‌ల కోట్ల క‌లెక్ష‌న్‌తో మోత మోగిస్తున్నాయి. వేల కోట్లు కురిపిస్తున్న ఆర్.ఆర్.ఆర్, కేజీఎఫ్ సినిమాల‌పై స్పెష‌ల్ స్టోరీ.

సినిమాల బ‌డ్జెట్
ఆర్. ఆర్. ఆర్ సినిమాను 450 కోట్ల రూపాయల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించారు. అంత‌కు మించిన క‌లెక్ష‌న్ కూడా రాబ‌ట్టింది. కానీ కేజీఎఫ్2 అలా కాదు. రికార్డుల‌ను తిర‌గ‌రాస్తూ సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. కేజీఎఫ్2 సినిమాకి నిర్మాతలు ఖ‌ర్చు చేసింది 150 కోట్లు. అయితే వ‌సూళ్ల ప‌రంగా చూస్తూ దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ అవాల్సిందే

థియేట‌ర్ల లెక్క‌లు
ప్ర‌పంచ వ్యాప్తంగా  ఆర్. ఆర్. ఆర్ 11 వేల‌కు పైగా స్క్రీన్స్‌ల‌లో రిలీజ్ అయితే.. కేజీఎఫ్2 10 వేల స్కీన్స్‌లో ఆడుతోంది.
అమెరికాలో ఆర్.ఆర్.ఆర్ దాదాపు 2 వేల థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. కేజీఎఫ్2 చిత్రాన్ని మాత్రం 1100 థియేట‌ర్ల‌లో రిలీజ్ చేశారు.
యునైటెడ్ కింగ్‌డ‌మ్‌లో 1100 స్కీన్స్‌లో, మిగ‌తా దేశాల్లో 1500 థియేట‌ర్ల‌లో ఆర్.ఆర్.ఆర్  రిలీజ్ అయింది. కేజీఎఫ్‌ను యునైటెడ్ కింగ్‌డ‌మ్‌లో 400 వంద‌ల స్కీన్స్‌లో.. మిగ‌తా దేశాల్లో 900 సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌ల చేశారు. 

క‌లెక్ష‌న్ వంద‌ల కోట్లే...
కేజీఎఫ్2
హీరో య‌శ్ న‌టించిన కేజీఎఫ్2 ఇండియ‌న్ సినిమాని షేక్ చేస్తోంది. విడుద‌లైన తొలి రోజే క‌లెక్ష‌న్ల మోత మోగిస్తోంది. నాలుగు రోజుల్లో 100 కోట్ల రూపాయ‌ల‌కు పైగా వ‌సూళ్లు చేసింది. ప్ర‌స్తుతం 500 కోట్ల రూపాయ‌ల మార్కును దాటేసింది. దీంతో కేజీఎఫ్2 ఇండియాతో పాటు ప్ర‌పంచ సినిమా ప్రేక్ష‌కుల‌ను కూడా ఆశ్చ‌ర్యప‌రుస్తోంది. ఇక ఇప్పుడు వేయి కోట్ల దిశ‌గా దూసుకెళుతోంది. 

ఆర్.ఆర్.ఆర్.
రాజ‌మౌళి సినిమా అంటేనే భారీ బ‌డ్జెట్.. అంతే భారీగా వ‌సూళ్లు ఉంటాయి. రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్‌ హీరోలుగా తెర‌కెక్కిన సినిమా రౌద్రం ర‌ణం రుథిరం (RRR). తొలి రోజు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ సినిమా.. మూడు రోజుల్లోనే 500 కోట్ల‌ను వ‌సూళ్లు చేసింది. రెండు వారాల్లో వేయి కోట్ల క్ల‌బులో చేరింది. ప్ర‌స్తుతం 1100 కోట్ల రికార్డుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంది.

సినీ వ‌ర్గాల్లో ఆర్.ఆర్.ఆర్. కేజీఎఫ్ సినిమాల క‌లెక్ష‌న్ల‌ గురించే టాక్ న‌డుస్తోంది. ఈ క‌లెక్ష‌న్లు మరి మ‌రెన్ని రికార్డులను బ్రేక్ చేయ‌నున్నాయో చూద్దాం.

.
 
Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!