KGF 2 Updates : ఎన్నో గొప్ప సినిమా రికార్డులను మటాష్ చేసిన యశ్ చిత్రం

Updated on Apr 19, 2022 04:43 PM IST
క‌న్న‌డ రాక్ స్టార్ య‌ష్ సినిమా కేజీఎఫ్ చాప్టర్2 ప్ర‌పంచ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొడుతుంది. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం అద‌ర‌హో అనిపించింది. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్ర‌పంచ‌ రికార్డుల‌ను తిర‌గ రాస్తుంది.
క‌న్న‌డ రాక్ స్టార్ య‌ష్ సినిమా కేజీఎఫ్ చాప్టర్2 ప్ర‌పంచ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొడుతుంది. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం అద‌ర‌హో అనిపించింది. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్ర‌పంచ‌ రికార్డుల‌ను తిర‌గ రాస్తుంది.

క‌న్న‌డ రాక్ స్టార్ య‌శ్ నటించిన కేజీఎఫ్ చాప్టర్2 ప్ర‌పంచ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొడుతోంది. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం అద‌ర‌హో అనిపించింది. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్ర‌పంచ‌ వ్యాప్తంగా కూడా రికార్డుల‌ను తిర‌గ రాస్తోంది. 

నాలుగు రోజులు... ఐదువంద‌ల కోట్లు. ఇదీ ఒక్క‌మాట‌లో చెప్పాలంటే, ఈ సినిమా రికార్డుల గురించి. ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన ఈ సినిమా ప్రపంచ రికార్డుల‌ను కొల్ల‌గొడుతోంది. రిలీజ్ అయిన నాలుగే రోజుల్లో 557 కోట్ల రూపాయ‌లను వ‌సూళ్లు చేసింది. 

కేజీఎఫ్2 సినిమాకు ఖ‌ర్చు చేసింది రూ.150 కోట్లు. కానీ వ‌సూళ్లు మాత్రం వంద‌ల కోట్ల రూపాయ‌లు. బాహుబ‌లి, ఆర్.ఆర్.ఆర్. త‌ర్వాత ఇంత‌టి భారీ క‌లెక్ష‌న్ రాబ‌ట్టిన ద‌క్షిణాది సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. తొలి రోజు అంటే గురువారం రూ. 165.37 కోట్లు, శుక్ర‌వారం రూ. 139.25 కోట్లు, శ‌నివారం రూ. 115.08 కోట్లను రాబ‌ట్టింది.

హిందీ వెర్షన్ కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. వీకెండ్‌లో ఎక్కువ కాసులు కురుపించిన తొలి చిత్రం కేజీఎఫ్ చాప్టర్2.  ఈ సినిమా ఏప్రిల్ 15, 16 17 మధ్య అత్యధిక వసూళ్లను రాబట్టింది. దీంతో ప్రపంచంలోనే కేజీఎఫ్‌ 2 రెండవ స్థానంలో ఉంది.

ఈ సినిమా షూటింగ్ మామూలు వాతావరణంలో చేయలేదని అంటున్నాడు హీరో యశ్.  సూర్యకాంతి ఎక్కువగా ఉన్నప్పుడే య‌శ్  షూటింగ్ చేసేవార‌ట‌. అలాగే రాత్రి పూట నేచుర‌ల్ లుక్ కోసం, లైట్ కోసం మంట పెట్టేవార‌ట‌. ఆ కాంతిలో షూటింగ్ చేసేవార‌ట‌. కేజీఎఫ్ సినిమాతో య‌ష్ స్టార్‌డ‌మ్ ఒక్క‌సారిగా పెరిగిపోయింది. ఇక కేజీఎఫ్ ఛాప్టర్2 తో ఆయన పాన్ ఇండియా హీరో కాబోతున్నాడు. దీన్ని బ‌ట్టే తెలుస్తుంది య‌శ్ సినిమాకి ఉన్న క్రేజ్ ఏమిటో. మ‌రిన్ని రికార్డులు ఈ సినిమా బ్రేక్ చేస్తుంద‌ని సినీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. 
 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!